Bharat Jodo Yathra : `భార‌త్ జోడో యాత్ర‌`కు రాహుల‌తో ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న రాహుల్ గాంధీ `భార‌త్ జోడో` యాత్ర‌కు ప్రియాంక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నారు.

  • Written By:
  • Updated On - November 22, 2022 / 05:30 PM IST

కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న రాహుల్ గాంధీ `భార‌త్ జోడో` యాత్ర‌కు ప్రియాంక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నారు. ఆమె ఈనెల 24వ తేదీన మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కొన‌సాగే యాత్ర‌లో పాల్గొంటారు. ఆ మేర‌కు కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ జ‌య‌రాం ర‌మేష్ ట్వీట్ చేశారు. ఈనెల 23న మ‌హారాష్ట్ర నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోకి రాహుల్ యాత్ర ఎంట్రీ ఇవ్వ‌నుంది. అయితే, ఈనెల 24వ‌న తేదీన రాహుల‌తో పాటు ప్రియాంక కూడా యాత్రలో ఉంటారు. నాలుగు రోజుల పాటు ఆమె యాత్ర కొన‌సాగిస్తార‌ని ప్ర‌క‌టించారు.

Also Read:  Gujarat Elections : కేసీఆర్ లో గుజ‌రాత్ స‌ర్వే గుబులు! బీజేపీ వైపే ఆత్మ‌సాక్షి స‌ర్వే!!

మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లోకి ప్రవేశించినప్పుడు నాలుగు రోజులు ప్రియాంక పాల్గొంటుంద‌ని జైరాం ర‌మేష్ వెల్ల‌డించారు. ప్రియాంక గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి. కర్ణాటకలో జరిగిన యాత్రలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్న విష‌యం విదిత‌మే. బుర్హాన్‌పూర్ సమీపంలోకి ప్రవేశించిన యాత్ర బుధవారం తిరిగి ప్రారంభం కానుంది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని బుర్హాన్‌పూర్ నుండి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్ర డిసెంబర్ 5న రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. ఆ సంద‌ర్భంగా ఖాండ్వాలోని ఓంకారేశ్వర్ , ఉజ్జయిని మహాకాళేశ్వర్ అనే రెండు జ్యోతిర్లింగ మహాదేవ్ ఆలయాలను రాహుల్ గాంధీ సందర్శించ‌నున్నారు. నవంబర్ 29న ఇండోర్‌లో రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉజ్జయినిలో భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.

Also Read:  YS Jagan Meeting : జ‌గన్ స‌భ `ఒక్క ఫోటో`వందరెట్ల అభ‌ద్ర‌త‌!

భారత్ జోడో యాత్ర డిసెంబర్ 5న రాజస్థాన్‌లోని ఝలావాడ్‌లోకి ప్రవేశించడానికి ముందు దాదాపు 15 రోజుల పాటు మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. నవంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన విష‌యం విదిత‌మే. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని ఆరు రాష్ట్రాలలో యాత్ర జ‌రిగింది. ఈనెల 24న రాహుల‌తో క‌లిసి ప్రియాంక పాద‌యాత్ర ఉంటుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూత‌నోత్సాహం నెల‌కొంది.