Wrestlers Protest: రెజ్లర్లకు ప్రియాంక గాంధీ సంఘీభావం ..స్పందించిన బ్రిజ్‌భూషణ్ శరణ్

తమపై లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు రెజ్లర్లు. బ్రిజ్‌భూషణ్ శరణ్ తమని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా

Published By: HashtagU Telugu Desk
Wrestlers Protest

Priyanka

Wrestlers Protest: తమపై లైంగిక వేధింపులకు నిరసనగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టారు రెజ్లర్లు. బ్రిజ్‌భూషణ్ శరణ్ తమని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాల మేరకు బ్రిజ్‌భూషణ్ శరణ్ పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత బ్రిజ్‌భూషణ్ శరణ్ తొలిసారిగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన సమాచారం ఇంకా అందలేదని, ఎఫ్‌ఐఆర్ కాపీ అందిన వెంటనే సమాధానం ఇస్తానని చెప్పారు. నేను నిర్దోషినని, విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉందని, ఎస్సీ ఆదేశాలను గౌరవిస్తానని ఆయన అన్నారు.

రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదయినప్పటికీ రెజ్లర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

బ్రిజ్ భూషణ్ శరణ్‌కు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ మరియు ఇతర రెజ్లర్లు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎఫ్‌ఐఆర్ కాపీని తీసుకునేందుకు రెజ్లర్లు ఈ రోజు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

Read More: Jiah Khan suicide: నటి జియాఖాన్ కేసులో సంచల తీర్పు

  Last Updated: 29 Apr 2023, 11:14 AM IST