Site icon HashtagU Telugu

wayanad : మళ్లీ వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ ప్రచారం ప్రారంభం..

Priyanka Gandhi campaign starts again in Wayanad..

Priyanka Gandhi campaign starts again in Wayanad..

Priyanka Gandhi : వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వద్రా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నవంబర్ 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలో తిరిగి పాల్గొననున్నారు. ఈ మేరకు నియోజవకర్గంలో ప్రియాంకా గాంధీ పబ్లిక్‌, కార్నర్ మీటింగ్‌లను నిర్వహించనున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు. 3వ తేదీన 11 గంటలకు మనంతవాది గాంధీ పార్క్ వద్ద రాహుల్‌, ప్రియాంకాలు పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.

అంతేకాక.. మరో మూడు చోట్ల ప్రియాంకా కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అరీకోడ్‌లో రాహుల్ మరో మీటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 4వ తేదీన కాల్‌పెట్టా, సుల్తాన్ బాథరే నియోజకవర్గాల్లో ప్రియాంకా కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు. 5,6,7 తేదీలకు చెందిన ప్రచార షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. కాగా, వాయనాడ్‌లో నవంబర్ 13న ఓటింగ్ జరగనుంది..ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి.

Read Also: Caste Census : సమగ్ర కుల సర్వేకు ప్రజలంతా సహకరించాలి: మంత్రి పొన్నం