Site icon HashtagU Telugu

World Wildlife Day : వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోడీ సఫారీ

Prime Minister Modi Safari in Wildlife Sanctuary

Prime Minister Modi Safari in Wildlife Sanctuary

World Wildlife Day : ఈరోజు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లయన్‌ సఫారీకి వెళ్లారు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ప్రధాని మోడీ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం ప్రధాని మోడీ జునాగఢ్ జిల్లాలోని గిర్‌ వన్యప్రాణుల అభయారణ్యానికి వెళ్లారు. కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీశారు. అందులోభాగంగా ఆయన లయన్‌ సఫారీ చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, అటవీశాఖ అధికారులు ఉన్నారు.

Read Also: Posani Krishna Murali : మరింత చిక్కుల్లో పోసాని కృష్ణమురళి 

వన్యప్రాణులను సంరక్షించడంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. భూమిపై ఉన్న అపురూపమైన జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రపంచంలోని ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయేతరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధాని మోడీ తెలిపారు. ఇక, మధ్యాహ్నం గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ప్రధాన కార్యాలయమైన ససన్ గిర్‌లో నిర్వహించనున్న నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్‌ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఇందులో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, వివిధ రాష్ట్రాల సభ్యులు, వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్నట్లు పలు ఎన్‌జీవోల ప్రతినిధులు పాల్గోనున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని ససన్‌లోని అటవీ సిబ్బందితో సంభాషించనున్నట్లు సమాచారం.

కాగా, ప్రధాని మోడీ గుజరాత్‌ పర్యటనలో భాగంగా ఆదివారం రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాను, సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం సాసన్‌లోని రాష్ట్ర అటవీశాఖ అతిథిగృహమైన సిన్హ్ సదన్‌లో బస చేశారు. సోమవారం తెల్లవారుజామున గిర్‌ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆసియాటిక్ సింహాలను సంరక్షించే లక్ష్యంతో ప్రాజెక్ట్ లయన్ కోసం రూ.2,900 కోట్లకు పైగా నిధులు మంజూరుచేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం.. ఆసియాటిక్ సింహాలు గుజరాత్‌లోని గిర్‌ అడవుల్లో దాదాపు 30,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి.

Read Also: Revanth Reddy : మోడీకి ‘జై’ కొట్టిన రేవంత్..కానీ