ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) తన 123వ “మన్ కీ బాత్” (‘Mann ki Baat’) ప్రసంగంలో తెలంగాణ భద్రాచలం మహిళలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. మిల్లెట్‌లను వినియోగించి ఆరోగ్యకరమైన బిస్కెట్లు తయారు చేసి లండన్‌కు ఎగుమతి చేసిన మహిళల కృషిని ప్రధానమంత్రి అభినందించారు. అంతేకాక, పర్యావరణ హిత శానిటరీ ప్యాడ్లు తయారీలోనూ వారిది మించిన కృషి అని తెలిపారు. మూడు నెలల్లోనే 40,000 ప్యాడ్‌లు తయారు చేసి విక్రయించారని వెల్లడించారు.
Mahaa News : ‘మా గడ్డపై ఉంటూ మాపై అసత్య ప్రచారం చేస్తారా’? – జగదీశ్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ప్రధాని దేశంలో సామాజిక భద్రత పెరుగుతున్న దిశగా ప్రగతిని హైలైట్ చేశారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం 95 కోట్ల మందికి పైగా ప్రజలు ఏదో ఒక సామాజిక భద్రతా పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారని పేర్కొన్నారు. 2015లో 25 కోట్ల మంది మాత్రమే ఈ సదుపాయాన్ని పొందుతున్నారని, ఇది దేశ అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు.
WHO ప్రకారం భారత్ ట్రాకోమా రహిత దేశంగా మారిన విషయాన్ని పంచుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రాముఖ్యతను కూడా వివరించారు. అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభంపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే, అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడిన నాయకులను ప్రజలు గుర్తుంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.