Sharmistha Vs Congress : భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు, మన్మోహన్ కుటుంబ సభ్యులకు కేంద్రహోంశాఖ సమాచారం అందించింది. ఈనేపథ్యంలో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ(Sharmistha Vs Congress) కీలక కామెంట్స్ చేశారు. తన తండ్రి చనిపోతే నివాళులు అర్పించడానికి ఆనాడు కనీసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ ) సమావేశాన్ని కూడా నిర్వహించలేదని ఆమె విమర్శించారు. ఈవిషయంలో కాంగ్రెస్ తనను తప్పుదోవ పట్టించిందని శర్మిష్టా మండిపడ్డారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్‌లోని ఓ సీనియర్ నేత తనతో చెప్పారని పేర్కొన్నారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ డైరీని చదివాక.. అది నిజం కాదని తెలిసిందన్నారు. రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్‌కు నివాళులు అర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం జరిగిందనే విషయం తన తండ్రి డైరీలో రాసి ఉందని శర్మిష్ఠా పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. కాగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2020లో కన్నుమూశారు.
Also Read :Fees Fear : ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీ‘జులుం’.. నియంత్రణకు రెడీ అవుతున్న రేవంత్ సర్కార్
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు ప్రస్తుతం (ఈవార్త ప్రచురితం అయ్యే సమయానికి) జరుగుతున్నాయి. అంత్యక్రియలు పూర్తయ్యాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్ర సర్కారు స్థలాన్ని కేటాయిస్తుంది. ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, మన్మోహన్ సింగ్ మెమోరియల్ ఏర్పాటు కోసం స్థలాన్ని కేటాయిస్తామని కేంద్ర హోం శాఖ తెలిపింది.
Also Read :Anil Ambanis Essay : ధీరూభాయ్ అంబానీ జయంతి.. తండ్రి గురించి అనిల్ అంబానీ ప్రత్యేక వ్యాసం
మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ హితవు పలికింది. ‘‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణానంతరం ఎలా ప్రవర్తించారో కాంగ్రెస్ నేతలు ఒకసారి గుర్తుచేసుకోవాలి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కాంగ్రెస్ ఎంతగా అవమానించిందో ఆయన కుమార్తె కూడా చెప్పారు’’ అని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ చురకలు పెట్టింది.