Site icon HashtagU Telugu

Manipur Tableau : మణిపుర్ శకటంపై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు

Prakash Raj Comments Manipu

Prakash Raj Comments Manipu

నిన్న శుక్రవారం దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (75th Republic Day) అంగరంగ వైభవం గా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. ఆ త‌ర్వాత త్రివిద ద‌ళాల‌ గౌరవ వందనాన్ని స్వీకరించి శకటాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ విచ్చేశారు. పలు రాష్ట్రాల నుంచి శకటాలు పరేడ్ చేశాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన శకటం అందరినీ ఆకర్షించింది. ఈ శకటం బాలరాముడిని ప్రదర్శించింది. చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఇందులో అగ్నివీర్‌లు కూడా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక మణిపుర్ శకటం (Manipur’s tableau) ప్రదర్శన పట్ల నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash ) తీవ్ర విమర్శలు చేశారు. ‘నారీ శక్తా? చక్రవర్తి, అతడి ప్రభుత్వం నగ్నంగా ఉంది అక్కడ. ఏమాత్రం సున్నితత్వం లేని ఈ కపటత్వాన్ని చూడండి’ అని ట్వీట్ చేశారు. మణిపుర్ హింస, జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు. పూర్తిగా మహిళల అధీనంలో నడిచే 500 ఏళ్ల ఇమా కీతెల్ మార్కెట్ శకటాన్ని మణిపుర్ రూపొందించింది. మరి దీనిపై బిజెపి నేతలు ఏమైనా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Also : YS Sharmila Package Star : షర్మిల ను కూడా ప్యాకేజ్ స్టార్ ను చేసిన వైసీపీ