UPSC Civil Services Prelims 2024 : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. తుఫాన్‌గా ఆవిర్భవించింది. దీని ప్రభావం ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా ఉండబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర సహా ఈ మూడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు- మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈ తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయ దిశగా 520, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 610, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారాకు ఆగ్నేయ దిశగా 610 కిలో మీటర్ల దూరంలో ఉంది.
అయితే తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మరో ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వీసుల పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మళ్లీ ఎప్పుడు ఈ పరీక్షలను నిర్వహిస్తామనేది ఇంకా వెల్లడించలేదు. వారం రోజుల్లో కొత్త తేదీని ఖరారు చేస్తామని పేర్కొంది. సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించడానికి 2023లో నోటిఫికేషన్ జారీ అయింది. అప్పట్లో ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీన ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. తుఫాన్ సంభవించనున్నందున దీన్ని వాయిదా వేసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.
ఈ తుఫాన్ గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారు జామున ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. బాలాసోర్ సమీపంలో గల ధర్మా పోర్ట్ వద్ద తీరాన్ని తాకుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావం వల్ల బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రత్యేకించి ఒడిశాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే అక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. గంజాం, పూరీ, జగత్‌సింగ్ పూర్, కేంద్రాపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, కియొంఝర్, ఢెంకనాల్, జైపూర్, అంగుల్, ఖుర్దా, నయాగఢ్, కటక్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవును ప్రకటించింది ప్రభుత్వం. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకు సెలవు ఉంటుంది.
Read Also: Chhota Rajan : ఛోటా రాజన్‌కు బెయిల్.. జీవితఖైదు శిక్ష రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు