Site icon HashtagU Telugu

Polygraph Test: కోల్‌క‌తా హ‌త్యాచారం కేసు.. నిందితుడు సంజ‌య్ రాయ్‌కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్‌..!

Polygraph Test

Polygraph Test: కోల్‌కతా అత్యాచారం-హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఈ కేసులో రోజుకో కొత్త రహస్యాలు బయటపడుతున్నాయి. నిజానిజాలు బయటకు తీసేందుకు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. చాలా రోజుల విచారణ తర్వాత మాజీ ప్రిన్సిపాల్‌తో సహా ఆరుగురికి నిన్న పాలిగ్రాఫ్ పరీక్ష (Polygraph Test) నిర్వహించారు. అయితే ప్రధాన నిందితుడి పాలిగ్రాఫ్ పరీక్ష వాయిదా పడింది. సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్ష ఆదివారం జైల్లోనే జరుగుతుంద‌ని అధికారులు తెలిపారు.

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ త‌ర్వాత ఎటువంటి విషయాలు బ‌య‌టికి వ‌స్తాయోన‌ని స‌ర్వ‌త్రా ఎదురుచూస్తున్నారు. అంతేకాక‌కుండా నిందితుడైన సంజ‌య్ రాయ్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని వైద్యులు కోరుతున్నారు.

Also Read: CM Cup : అక్టోబరు 2 నుంచి ‘సీఎం కప్’.. రాష్ట్రస్థాయికి ఎంపికైతే గోల్డెన్ ఛాన్స్

ఈరోజు సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు

శనివారం సీబీఐ కార్యాలయంలో మాజీ ప్రిన్సిపాల్‌ సహా ఆరుగురికి పాలిగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న జైలులోనే ఈరోజు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నారు. సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ పరీక్ష తర్వాత బహిర్గతమయ్యే అనేక రహస్యాలను సీబీఐ బయటపెట్టాలనుకుంటోంది. ఆ రాత్రి ప్రధాన నిందితుడితో మరెవరికైనా ప్రమేయం ఉందా..? అతను ఈ ఘటనకు ఎలా పాల్పడ్డాడో సీబీఐకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాజీ ప్రిన్సిపాల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

సీబీఐ కేసు నమోదు చేసింది

మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండ‌టంతో ఈ మేర‌కు కేసు న‌మోదు చేశారు. ఆసుపత్రి అధిపతిగా తనకు ఈ ఘటన గురించి ఎప్పుడు, ఎలా తెలిసింది..? నివేదిక ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరిగిందో సీబీఐ తెలుసుకోనుంది. ఆయ‌న‌తో పాటు మరో నలుగురు ట్రైనీ డాక్టర్లు ఘటనకు ముందు బాధిత మహిళా డాక్టర్‌తో కలిసి రాత్రి భోజనం చేసినందున సీబీఐ వారికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది.