Lok Sabha Election 2024: 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్‌

  • Written By:
  • Publish Date - March 16, 2024 / 04:54 PM IST

 

Lok Sabha Election 2024 schedule announcement ECI : సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ప్రస్తుత 17వ లోక్‌సభకు జూన్‌ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు..

— 7 దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌

— 22 రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్‌

— ఏపీ ,తెలంగాణ , అరుణాచల్‌,ఢిల్లీ,గోవా,గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ , హర్యానా ,

— కేరళ,తమిళనాడు,పంజాబ్‌,ఉత్తరాఖండ్‌,సిక్కిం,మిజోరాం,మేఘాలయా.నాగాలాండ్‌,పుదుచ్చేరి,

— చండీఘడ్‌,లక్షద్వీప్‌,దాద్రానగర్‌ హవేలి,అండమాన్‌ నికోబార్‌లో ఒకే దశలో పోలింగ్‌

— కర్నాటక,రాజస్థాన్‌,త్రిపుర,మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు

— అసోం , చత్తీస్‌ఘడ్‌లో 3 దశల్లో పోలింగ్‌

— ఒడిశా , మధ్యప్రదేశ్‌,జార్ఖండ్‌లో 4 దశల్లో పోలింగ్‌

— మహారాష్ట్ర,జమ్ముకశ్మీర్‌లో ఐదు దశల్లో పోలింగ్

— ఉత్తరప్రదేశ్‌,బిహార్‌,బెంగాల్‌లో 7 దశల్లో పోలింగ్‌


ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న వెలువడుతుంది. ఏప్రిల్‌ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఏప్రిల్‌ 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుంది. జూన్‌ ఆరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇలా..

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను సీఈసీ ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల షెడ్యూల్ విడుదల..

=దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

=తెలంగాణలో కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌

=ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు, కౌంటింగ్‌ జూన్‌ 4

=ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు

=మార్చి 20న నోటిఫికేషన్, ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్

=తొలి దశలో 102 ఎంపీ స్థానాలకు పోలింగ్

=ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్

=7న మూడో దశ పోలింగ్

=మే 13న నాలుగో దశ పోలింగ్

=నాలుగో దశలో తెలంగాణ ఎంపీ ఎన్నికలు

=మే 20న ఐదో దశ పోలింగ్

=మే 25న ఆరో దశ పోలింగ్

=జూన్‌ 1న తుది దశ పోలింగ్

read also:Paneer Benefits: ప‌నీర్ తింటే క‌లిగే లాభాలు ఇవే.. ఒక‌సారి తింటే వ‌దిలిపెట్ట‌రు..!