Site icon HashtagU Telugu

‘Nabanna March ​’ : నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగం

Kolkata Nabanna Protest

Kolkata Nabanna Protest

కోల్​కతా వైద్యురాలి హత్యపై నిరసనగా పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘నబన్నా అభియాన్​​’ మార్చ్ (Nabanna March) ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో..పోలీసుల ఫై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి.. రోడ్డు మీద ఉన్న వారిని చెల్లాచెదురు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నబన్నా మార్చ్​కి పర్మిషన్ ఇవ్వబోమని అధికార తృణమూల్​ కాంగ్రెస్​ ముందే చెప్పింది. ర్యాలీలో హింసకు పాల్పడేందుకు పలువురు కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించింది. అయినప్పటికీ నిరసనకారులు వినకుండా నిరసన తెలుపుతుండడంతో వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది. నిరసనకారులు సెక్రటేరియట్​కు చేరుకోకుండా చూసేందుకు 6వేలకుపైగా మంది పోలీసులను మోహరించింది. ర్యాలీపై డ్రోన్​ నిఘా పెట్టింది. అంతేకాకుండా నిరసనకారులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ నిరసనలు కారులు తమ ఆందోళనలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కోల్​కతా వైద్యురాలి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ (Minister Mamata Banerjee) రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తూ, నిరసనకారులు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు కదిలారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

ఇదిలా ఉంటె హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ఉపయోగించిన బైక్ కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ చేయబడిందని తేలింది. నిందితుడు కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా కొనసాగుతున్నాడు. ఇక, నేరం జరిగిన రోజు ఉత్తర కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాలను సందర్శించడానికి ఈ బైక్ ను ఉపయోగించినట్లు వెల్లడైంది. నిందితుడు సంజయ్ రాయ్ మద్యం మత్తులో 15 కిలో మీటర్ల దూరం పాటు బైక్‌ను నడిపినట్లు తెలుస్తుంది.

Read Also : Aadhaar Card: ఆధార్ కార్డ్ యూజర్స్ కి హెచ్చరిక.. సెప్టెంబర్ 14 లోపు అది పూర్తి చేసుకోవాలంటూ!