Site icon HashtagU Telugu

PM Surya Ghar : మీ ఇంటికి కరెంట్ బిల్లు అధికంగా వస్తుందా..? అయితే ఈ పని చెయ్యండి

Pradhan Mantri Surya Ghar M

Pradhan Mantri Surya Ghar M

ఈరోజుల్లో ఎక్కువ మంది కరెంట్ బిల్లు(Current Bill)కు భయపడి, అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వాడాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం ఓ ఉపయోగకరమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం పేరు ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన'(Pradhan Mantri Surya Ghar Muft Bijli Yojana). దీని కింద ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కేంద్రం నుంచి 40% వరకు సబ్సిడీ లభిస్తుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మడం ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంది.

Tension Tension : తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు

ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) 2024 ఫిబ్రవరిలో ప్రారంభించారు. దీని ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా ఒక కోటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం. దీని ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గి, పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చు. 3kW సామర్థ్యం వరకు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే రూ.78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారు, చిన్న వ్యాపారస్తులు ఈ పథకానికి అర్హులు. ప్రత్యేకించి వేసవిలో ACలు వాడే వారికి ఇది చాలా ప్రయోజనకరం.

ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. వినియోగదారుడు లాగిన్ అయి, అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేయవచ్చు. ప్లాంట్ ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యాక, వెండర్ ద్వారా DISCOMకు సమాచారం అందించి, వారు పరిశీలించిన తర్వాత సబ్సిడీ విడుదల అవుతుంది. పక్కా ప్రణాళికతో అమలు అవుతున్న ఈ పథకం ద్వారా ఇంటికి కరెంట్ ఖర్చు తగ్గడమే కాదు స్వచ్ఛమైన విద్యుత్ ద్వారా పర్యావరణ హితమైన జీవితాన్ని గడపొచ్చు.