PM Modi: నేడు మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన

మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నేడు (ఆదివారం) సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi). ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

  • Written By:
  • Updated On - December 18, 2022 / 09:24 AM IST

మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నేడు (ఆదివారం) సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi). ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్ట్రన్‌ కౌన్సిల్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. దాదాపు రూ. 2,450 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. షిల్లాంగ్‌లోని ఉమ్‌సాలిలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్స్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (డిసెంబర్ 18) ఎన్నికలకు వెళ్లనున్న త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలలో పర్యటించనున్నారు. అక్కడ రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులలో గృహనిర్మాణం, రోడ్లు, వ్యవసాయం, టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టూరిజం, హాస్పిటాలిటీ వంటి వివిధ రంగాలలో ప్రాజెక్టులు ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ పాల్గొంటారని, షిల్లాంగ్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారని పీఎంవో తెలిపింది. అగర్తలాలో ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ అండ్ రూరల్’ కింద రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారుల కోసం ‘గృహ ప్రవేశ్’ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించనున్నారు.

Also Read: Naked foreign woman: జైపూర్‌లో విదేశీ మహిళ నగ్నంగా వీరంగం

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా శనివారం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు సహాయపడే కొత్త మార్గాల గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తారని అన్నారు. ఇక్కడ ‘ప్రధాన్ మంత్రి గతి శక్తి’పై ఈశాన్య ప్రాంతీయ సదస్సు ప్రారంభోత్సవంలో సాహా మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ‘యాక్ట్ ఈస్ట్’ విధానంపై తీవ్రంగా కృషి చేస్తోందని సాహా చెప్పారు. త్రిపురలో అత్యుత్తమ విమానాశ్రయాలలో ఒకటి ప్రారంభించబడింది. దీంతోపాటు ఈశాన్య రాష్ట్రానికి ఏడు కొత్త జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.10,222 కోట్లు మంజూరు చేసింది.