Swearing In Ceremony : నరేంద్రమోడీ మళ్లీ ప్రధానమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ? అనే దానిపై కీలక సమాచారం బయటికి వచ్చింది. ఈనెల 8న ఆయన ప్రధానిగా ప్రమాణం చేస్తారని సంబంధిత వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమిలోని పార్టీలన్నీ హాజరవుతాయని తెలుస్తోంది. కర్తవ్యపథ్ వేదికగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాసంలో ఎన్డీయే కూటమి నేతలు భేటీ కానున్నారు. ఆ తరవాత కూటమి నేతలంతా వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమని.. అందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 తమ వద్ద ఉందని రాష్ట్రపతికి తెలియజేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా 241 చోట్ల విజయం సాధించగా NDA కూటమికి 294 సీట్లు వచ్చాయి.
Also Read :Lok Sabha Secretariat : లోక్‌సభ సచివాలయం సన్నాహాలు.. కొత్త ఎంపీల కోసం ఏర్పాట్లు
నెహ్రూ రికార్డు సమం చేసిన మోడీ
వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా జవహర్ లాల్ నెహ్రూ రికార్డుని మోడీ సమం చేయనున్నారు. 1962 తరవాత వరసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు తీసుకున్న నేతగానూ మోడీ రికార్డు సృష్టించనున్నారు. 1947 నుంచి 1964 వరకూ వరసగా మూడు సార్లు ప్రధానిగా నెహ్రూ ఉన్నారు. దాదాపు 16 సంవత్సరాల 286 రోజుల పాటు ఈ పదవిలో నెహ్రూ కొనసాగారు.
Also Read :YS Sharmila Wishes: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలపిన వైఎస్ షర్మిల
ఇవాళ ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో జరిగే పరిణామాలను యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తున్నాయి. మరోవైపు కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం పాలన సాగించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 18వ లోక్ సభ నిర్వహణ కోసం లోక్ సభ సచివాలయం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఒక్క శాతం కూడా పేపర్ వాడకుండా కార్యకలాపాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. కొత్త లోక్‌సభ సభ్యుల రిజిస్ట్రేషన్ సహా అన్ని కార్యకలాపాలను డిజిటల్ పద్దతిలోనే సచివాలయం అధికారులు నిర్వహించనున్నారు. డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం పార్లమెంటు ప్రాంగణంలో ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.