రాఖీ (Rakhi ) పండుగ అంటే అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక. ఈ రోజున తోడబుట్టిన వారికి మాత్రమే కాకుండా, సోదరభావంతో మెలిగే వారికి కూడా రాఖీ కట్టడం ఆనవాయితీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi)కి ప్రతి సంవత్సరం చాలా మంది మహిళలు రాఖీలు కడుతూ ఉంటారు. కానీ ఒక ముస్లిం మహిళ మాత్రం గత 30 సంవత్సరాలుగా ఆయనకు రాఖీ కడుతూ తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు. ఆమే పాకిస్థాన్‌లో పుట్టి, భారతదేశంలో స్థిరపడిన ఖమర్ మొహ్సిన్ షేక్.
Kantara Chapter1 : కాంతారా.. చాప్టర్ 1′ నుంచి రుక్మిణి వసంత్ ఫస్ట్‌లుక్
ఈ ఏడాది రాఖీ పండుగ కోసం ఖమర్ మొహ్సిన్ షేక్ (Qamar Mohsin Sheikh) ప్రత్యేకంగా ‘ఓం’ గుర్తుతో ఉన్న రాఖీని తయారు చేశారు. ఇది సంప్రదాయానికి, భక్తికి నిదర్శనమని ఆమె తెలిపారు. గత 30 ఏళ్లుగా ఆమె స్వయంగా రాఖీలు తయారు చేసి, వాటిలో ఒకటి మోదీకి కడుతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి కావాలనీ, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రి కావాలనీ కోరిన ఆమె కోరికలు నెరవేరాయి. ఇప్పుడు ప్రపంచాన్ని పాలించాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. మన దేశం సాధిస్తున్న విజయాలకు మోదీ కృషి కారణమని ఆమె ప్రశంసించారు.
Kohli New Look : తెల్లగడ్డం తో కోహ్లీ న్యూ లుక్
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు, ఆరెస్సెస్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచే ఖమర్ మొహ్సిన్ షేక్ ఆయనకు రాఖీ కడుతున్నారు. ఆ సమయంలో “సోదరీ.. ఎలా ఉన్నారు?” అని మోదీ పలకరించడంతో వారి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం మొదలైందని ఆమె గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో తప్ప, ఆమె ప్రతి సంవత్సరం మోదీకి రాఖీ కడుతూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా స్వయంగా రాఖీ కట్టాలని, అందుకోసం ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నానని ఆమె తెలిపారు. తాను ఒక ముస్లిం మహిళ అయినప్పటికీ, ఈ బంధాన్ని కొనసాగించడం తనకు గర్వంగా ఉందని మొహ్సిన్ షేక్ అన్నారు.