Mann ki Baat : ‘డిజిటల్‌ అరెస్ట్‌’లపై ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచనలు

నేరగాళ్ల నుంచి ఇలాంటి కాల్స్‌ వస్తే 1930 నంబర్‌ లేదా సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌‌కు(Mann ki Baat) ఫిర్యాదు చేయాలని సూచించారు.

Published By: HashtagU Telugu Desk
Pm Modi Mann Ki Baat Digital Arrest Scams Cyber Crimes

Mann ki Baat : ‘మన్‌కీ బాత్‌’ 115వ ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పలు కీలక అంశాలను టచ్ చేశారు. డిజిటల్‌ అరెస్టులు, ఆన్‌లైన్‌ స్కామ్‌లపై దేశ ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ మోసాలకు సంబంధించిన ఒక వీడియోను ప్రధాని మోడీ ప్లే చేశారు. సైబర్ కేటుగాళ్లు తమను తాము దర్యాప్తు సంస్థల అధికారులుగా పరిచయం చేసుకొని.. ఏ విధంగా ప్రజలను ట్రాప్‌లోకి లాగుతారనేది ఆ వీడియోలో ఉంది.  దేశంలోని ఏ దర్యాప్తు సంస్థలు కూడా ఈవిధంగా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌ ద్వారా ప్రజలను సంప్రదించవని మోడీ స్పష్టం చేశారు. నేరగాళ్ల నుంచి ఇలాంటి కాల్స్‌ వస్తే 1930 నంబర్‌ లేదా సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌‌కు(Mann ki Baat) ఫిర్యాదు చేయాలని సూచించారు.

Also Read :Philippines Floods: ఫిలిప్పీన్స్‌లో తుఫాను.. 100 మంది మృతి, 51 మంది గల్లంతు

‘‘సైబర్ కేటుగాళ్లు ఫోన్ కాల్ చేసి.. మీరు డిజిటల్ అరెస్టు అయ్యారని చెబితే అస్సలు భయపడొద్దు. ఇలాంటప్పుడు మీరు త్రీ స్టెప్ పద్ధతిని ఫాలోకండి. మొదటిది.. మీరు కాల్ రాగానే విని గాబరాపడొద్దు. కామ్‌గా వాళ్లు చెప్పేది వినండి. అది నిజమని నమ్మి తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలూ తీసుకోండి. ఆ కేటుగాళ్లకు మీ వ్యక్తిగత సమాచారమేదీ ఇవ్వొద్దు. ఆ కాల్‌ను రికార్డ్ చేయండి. సైబర్ కేటుగాడు వీడియో కాల్ చేసి ఉంటే స్క్రీన్ షాట్ ద్వారా అతడి ఫొటోను సేవ్ చేయండి. మన దేశంలోని ఏ దర్యాప్తు సంస్థ కూడా వీడియో కాల్‌లో కేసుల విచారించదని గుర్తుంచుకోండి., దర్యాప్తు సంస్థలు డబ్బులు అస్సలు అడగవు. ఆ తర్వాత మీకు వచ్చిన బెదిరింపు కాల్‌పై నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ నంబరు  1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ పోర్టల్‌లో కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు. మీ కుటుంబం వాళ్లకు కూడా  దీనిపై సమాచారం ఇవ్వండి. స్థానిక పోలీసులకు కంప్లయింట్ ఇవ్వండి’’ అని ప్రధాని మోడీ ఈసందర్భంగా వివరించారు.

Also Read :Salman Khan : లారెన్స్ గ్యాంగ్ ఏదైనా చేస్తుందేమో.. సల్మాన్ సారీ చెప్పుకో : రాకేశ్‌ టికాయత్‌

మోడీ ఇంకా ఏం చెప్పారంటే.. 

  • ప్రధాని మోడీ దేశ ప్రజలకు ముందస్తుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
  • అక్టోబర్‌ 28న ‘వరల్డ్‌ యానిమేషన్‌ డే’ను మనం జరుపుకోబోతున్నామని ప్రధాని మోడీ చెప్పారు.  భారత్‌ను గ్లోబల్‌ యానిమేషన్‌ పవర్‌హౌస్‌గా మార్చేందుకు సంకల్పించాలని పిలుపునిచ్చారు. యువత మన సంస్కృతికి అద్దం పట్టే ఒరిజినల్‌ ఇండియన్‌ కంటెంట్‌ను రూపొందిస్తోందని ప్రధాని కితాబిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వీటిని వీక్షిస్తున్నారని తెలిపారు.
  Last Updated: 27 Oct 2024, 01:21 PM IST