Site icon HashtagU Telugu

ISRO Aditya-L1: ఇస్రో విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

ISRO Aditya-L1

ISRO Aditya-L1

ISRO Aditya-L1: చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3 విజయవంతంగా ల్యాండ్‌ అయిన తర్వాత.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అరుదైన ఘనత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇస్రో సాధించిన ఘనతపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనతను సాధించింది. సూర్యుని తుది కక్ష్యలోకి చేర్చేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్1ను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ట్వీట్ చేశారు. భారత్ మరో మైలురాయిని చేరుకుందని ప్రకటించారు.

శాస్త్రవేత్తలు ఆదిత్య ఎల్1ను లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లోకి పంపారు. 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య ఎల్ 1 ను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హాలో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ఇస్రో శాస్త్రవేత్తలు చేర్చారు. అక్కడి నుంచి ఆదిత్య ఎల్1 సూర్యుడిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆదిత్య L1 సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల అంతరిక్షంలో ఉన్న భారత శాటిలైట్లు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తుంది.

పరిశోధనల కోసం సూర్యుడి వద్దకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదేనన్న సంగతి తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఆదిత్య L1 సౌర వాతావరణం, సౌర మంటలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ మొదలైన వాటిని అధ్యయనం చేయడానికి కీలక సమాచారాన్ని అందిస్తుంది.

Also Read: Vijay Binni: నా సామిరంగ ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది: డైరెక్టర్ విజయ్ బిన్ని