Sanjay Raut: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత సోమవారం రోజు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ..ప్రధాని మోడీ పదవీ విరమణ చేయాలని ఆలోచిస్తున్నారని.. ఆ విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు చెప్పేందుకే అక్కడకు వెళ్లారని తెలిపారు. సెప్టెంబర్ నెలలోనే ప్రధాని పదవిని వీడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆయన రాజకీయ వారసుడు మహారాష్ట్ర నుంచి వస్తారని వెల్లడించారు.
Read Also: Amazon : ఉత్పత్తులపై జీరో రెఫరల్ ఫీజులను ప్రకటించిన అమెజాన్
ఆర్‌ఎస్‌ఎస్ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటున్నట్లు నేను నమ్ముతున్నాను. వారు తదుపరి బీజేపీ చీఫ్‌ను ఎన్నుకోవాలనుకుంటున్నారు. ఆ సంస్థ నియమాల ప్రకారం మోడీ కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన మోహన్ భాగవత్‌ను కలిసి రిటైర్మెంట్ పత్రాన్ని సమర్పించడానికి వెళ్లి ఉంటారు అని అన్నారు. కాగా, భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లలేదు. కాగా దేశ ప్రధానులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని అధికారికంగా సందర్శించడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో వాజ్‌పేయి మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనిని సందర్శించారు.
ఇక, ఈ క్రమంలోనే ప్రధాని మోడీ తొలిసారిగా ఆదివారం నాగ్‌పుర్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. తొలుత డా.హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లిన ప్రధాని.. సంస్థ వ్యవస్థాపకుడు డా.కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, రెండో సర్‌సంఘ్‌చాలక్ ఎంఎస్ గోళ్వాల్కర్‌లకు నివాళులు అర్పించారు. అనంతరం స్మృతిభవన్‌లో ఆరెస్సెస్ పదాధికారులతో భేటీ అయి వారితో గ్రూప్‌ఫొటో దిగారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను దేశ అజరామర సంస్కృతి, ఆధునికీకరణ వటవృక్షంగా అభివర్ణించారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కూడా కలిసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
Read Also: Nara Lokesh: టీడీపీ కార్యకర్తలకు నారా లోకేష్ మరో కీలక హామీ!