Site icon HashtagU Telugu

PM Modi: పార్టీ మీటింగులకు పాఠశాల విద్యార్థులు, విచారణకు ఆదేశం

Pm Modi

Pm Modi

PM Modi: తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు పాఠశాల విద్యార్థులు హాజరుపై కలెక్టర్ మండిపడ్డారు. ఈ ఘటనపై శ్రీసాయిబాబా విద్యాలయం ఎయిడెడ్‌ మిడిల్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని జిల్లా విద్యాశాఖాను కోరారు.

కోయంబత్తూరులో ప్రధాని మోదీ సోమవారం నిర్వహించిన రోడ్ షోలో 50 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ క్రాంతికుమార్ విచారణ చేపట్టారు. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. నిజానికి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రచారానికి పిల్లలను ఉపయోగించకుండా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రోడ్‌షోలో హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ కార్యక్రమానికి రెండు గంటల ముందు సాయిబాబా కాలనీ జంక్షన్‌కు తరలిరావాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించారని చెప్పారు.

Also Read: BRS Party: పార్టీని వీడి వెళ్లినవారిని తిరిగి రానిచ్చేదిలేదు.. బీఆర్ఎస్ మాజీ మంత్రి వార్నింగ్