PM Modi : మైనారిటీలకు వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించేందుకు తాను సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదని తేల్చి చెప్పారు. ప్రముఖ వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని మోడీ మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join
హిందువుల సంపదను కాంగ్రెస్ నిజంగా ముస్లింలకు ఇస్తుందని మీరు నమ్ముతున్నారా? లేదా అది ప్రచార ప్రచార అస్త్రమా? అనే ప్రశ్నకు మోడీ(PM Modi) ఈసందర్భంగా సమాధానమిచ్చారు. తాను చేయని వ్యాఖ్యలపై అసత్య ప్రచారాన్ని విపక్షాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో వెలువడిన రోజే అందులో ముస్లిం లీగ్ ముద్ర ఉందని తాను చెప్పానని తెలిపారు. కానీ ఆరోజు కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండిపోయిందన్నారు. అందుకే రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తనకు అనిపించిందని ప్రధాని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్ ఉల్లంఘిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు యత్నిస్తున్నాయన్నారు. ‘‘నేను సబ్ కా సాత్, సబ్ కా వికాస్‌ను నమ్ముతాను. అందరినీ సమానంగా పరిగణిస్తాం’’ అని మోడీ తెలిపారు.
Also Read :Iran President Death: భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోందని మోడీ భరోసా
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు దాటుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందన్నారు. ‘‘బీజేపీని బనియా బ్రాహ్మణ పార్టీ అని విపక్షాలు విమర్శిస్తుంటాయి. కానీ అత్యధిక సంఖ్యలో దళిత, ఓబీసీ, ఎస్టీ ఎంపీ/ఎమ్మెల్యేలు కలిగిన ఉన్న పార్టీ బీజేపీ’’ అని మోడీ తెలిపారు. రాజ్యాంగం తన జీవిత గమనానికి దిక్సూచి అని ఆయన చెప్పారు. భారత దేశానికి దళిత, గిరిజన రాష్ట్రపతిని అందించిన పార్టీ బీజేపీయే అని గుర్తు చేశారు. మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదన్నారు.