Site icon HashtagU Telugu

PM Modi : కాంగ్రెస్ గెలిచినప్పుడల్లా నక్సలైట్లు, టెర్రరిస్టులు బలోపేతమయ్యారు : ప్రధాని మోడీ

PM Modi Interview

Pm Modi

PM Modi :  ఓ వైపు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నక్సలిజం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఉగ్రవాదులు, నక్సలైట్లు బాగా బలోపేతం అయ్యారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ హింసను నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఉగ్రవాదులు, నక్సలైట్ల సమస్యలు ఉన్నాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో బాంబు పేలుళ్లకు, ఉగ్రవాద కార్యకలాపాలకు తావు లేకుండా చేశామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిష్రాంపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ  ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో మనుషులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిపోయిందని ప్రధాని మోడీ ఆరోపించారు

We’re now on WhatsApp. Click to Join.

గతవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో బీజేపీ కార్యకర్త రతన్ దూబే ఎన్నికల ప్రచారం చేస్తుండగా నక్సలైట్లు హత్య చేశారు. ఝరాఘటి పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌశల్‌నగర్ గ్రామంలో ఉన్న మార్కెట్‌లో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రతన్ దూబేను  పదునైన ఆయుధంతో నక్సల్స్ నరికి చంపారు. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ‘‘కొద్దిరోజుల క్రితం మా పార్టీకి చెందిన ఒక నేతను పాశవికంగా చంపారు.  బాంబులు, తుపాకుల నీడలోనే మీరు (నక్సల్స్) బతకాలని అనుకుంటున్నారా? మీ దగ్గర చాలా డబ్బు ఉండి ఉండొచ్చు. ఎంత డబ్బు ఉన్నా..  మీ కొడుకు సాయంత్రం ఇంటికి తిరిగి రాకుండా, అతడి శరీరం ఇంటికి చేరితే ఆ డబ్బు ఉండి కూడా లాభమేంటి ?’’ అని ప్రధాని మోడీ(PM Modi)  వ్యాఖ్యానించారు.

Also Read: Ponguleti : త్వరలోనే నాపై ఐటీ రైడ్స్.. బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది : పొంగులేటి

Exit mobile version