Site icon HashtagU Telugu

Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. ఉగ్రదాడిపై మోడీ సీరియస్

Pm Modi Mann Ki Baat Pahalgam Attack Terrorists Pakistan India Kashmir 

Mann Ki Baat: ‘‘ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఫొటోలను చూస్తుంటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోంది. ఈ దాడి పిరికిపందల చర్య’’ అంటూ ఇవాళ మన్ కీ బాత్‌‌లో ప్రధాని మోడీ మండిపడ్డారు.  ‘‘ఆ ఉగ్రదాడి ఘటన గురించి తెలిశాక నా మనసుకు ఎంతో బాధ కలిగింది. దేశంలోని ప్రతీ పౌరుడు ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఈ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని ఆయన వెల్లడించారు.

Also Read :Maoists Tunnel : కర్రెగుట్టల్లో భారీ సొరంగం.. మావోయిస్టుల కదలికలపై కీలక సమాచారం

ఓర్వలేకపోయారు.. అందుకే ఈ దాడి : ప్రధాని మోడీ

‘‘కశ్మీర్‌లో గత కొన్నేళ్లుగా పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. ప్రజాస్వామ్యం బలపడుతోంది. పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. తిరిగి శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇదంతా  చూసి మనదేశ శత్రువులు, జమ్మూ కాశ్మీర్ శత్రువులు ఓర్వలేకపోయారు. మళ్లీ అంతా నాశనం చేయాలని పెద్ద కుట్ర పన్నారు. పాక్ ఉగ్రదాడి తర్వాత మన దేశం మొత్తం ఏకమైంది. ప్రపంచం మనవైపే చూస్తోంది’’ అని మోడీ(Mann Ki Baat) తెలిపారు. ‘‘మేం ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిపై, కుట్రదారులపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులకు న్యాయం జరిగి తీరుతుంది’’ అని భారత ప్రధానమంత్రి ప్రకటించారు.

Also Read :Storm Control Tech: సంకల్పం గెలిచె.. పిడుగును కంట్రోల్​ చేసే టెక్నాలజీ

బాధితుల కుటుంబాలకు న్యాయం జరుగుతుంది

‘‘ఉగ్రవాదంపై పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులకు ప్రపంచం మొత్తం అండగా నిలుస్తుంది. బాధితుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని మరోసారి నేను హామీ ఇస్తున్నాను. ఈ దాడికి కుట్రదారులు, నేరస్థులు అత్యంత కఠినమైన శిక్షను ఎదుర్కొంటారు’’ అని ఆయన స్పష్టం చేశారు.“ఈ ఉగ్రదాడి తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌కు నిరంతరం సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.ఎంతోమంది ప్రపంచ నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు. లేఖలు రాశారు. సంతాప సందేశాలు పంపారు. ఈ దారుణమైన ఉగ్రవాద దాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. వారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు’’ అని మోడీ చెప్పుకొచ్చారు.