Site icon HashtagU Telugu

9 Vande Bharat Trains : పచ్చజెండా ఊపిన ప్రధాని మోడీ.. 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం

9 Vande Bharat Trains

9 Vande Bharat Trains

9 Vande Bharat Trains : ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం  మధ్యాహ్నం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో మొత్తం 11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త ట్రైన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్,  కర్ణాటక, బీహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఝార్ఖండ్, గుజరాత్‌ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ – బెంగళూరు మధ్య, విజయవాడ-చెన్నై మధ్య ఈ కొత్త రైళ్ల సర్వీసులు నడవనున్నాయి.

Also read : Chandrababu Lunch Break : లంచ్ బ్రేక్ దాకా చంద్రబాబుకు సీఐడీ వేసిన ప్రశ్నలు అవేనా !?

ఈసందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘నవభారత స్ఫూర్తికి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నిదర్శనం’’ అని చెప్పారు. ఆదివారం కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ హయాంలో రైల్వే శాఖలో నూతన శకం ప్రారంభమైందని (9 Vande Bharat Trains) చెప్పారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, ఇప్పుడు మరో రెండు రైళ్లను మోడీ ప్రారంభించారని వివరించారు.

Exit mobile version