What Is Vantara: ‘వన్ తార’లో ప్రధాని సందడి .. ఏమిటిది ? మోడీ ఏం చేశారు ?

వన్ తార(What Is Vantara) దాదాపు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉంది.

Published By: HashtagU Telugu Desk
What Is Vantara Pm Modi Gujarat Anant Ambani Reliance Industries Reliance Foundation

What Is Vantara: వన్ తారా .. ఇప్పుడిది ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే గుజరాత్‌లోని జామ్ నగర్‌లో దీన్ని  తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులోని ఆసియాటిక్ సింహం పిల్లలు, తెల్ల సింహం పిల్ల, చిరుతపులి పిల్ల, కారకల్ పిల్ల, ఒక కొమ్ము ఖడ్గమృగం, జిరాఫీ, చింపాంజీ, ఒరంగుటాన్‌, హిప్పోపొటామస్‌, మొసళ్లు, ఏనుగులు, పెద్ద పాములు వంటి వివిధ జంతు జాతులతో మోడీ సరదాగా గడిపారు. వన్ తారలో ఏర్పాటుచేసిన వన్యప్రాణుల ఆస్పత్రిని ప్రధాని సందర్శించారు. ఈ ఆస్పత్రిలోని వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన విభాగాలను ఆయన పరిశీలించారు. జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్‌లు, ICU యూనిట్లను మోడీ చూశారు. ఆసియాటిక్ సింహానికి MRI చేయడం, గాయపడిన చిరుతకు ఆపరేషన్ చేయడం వంటి దృశ్యాలను ఆయన తిలకించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆస్పత్రి వన్ తారలోనే ఉంది. దీన్ని కూడా మోడీ సందర్శించారు.

ఏమిటీ వన్ తార ?

  • వన్ తారను గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అనంత్ అంబానీ ఏర్పాటు చేశారు. దీనికి రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ సహాయ సహకారాలను అందిస్తున్నాయి.
  • వన్ తార(What Is Vantara) దాదాపు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉంది.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ పరిధిలోనే వన్ తార ఉంది.
  • దేశంలోని వివిధ చోట్ల రక్షించిన దాదాపు 1.5 లక్షలకుపైగా వన్య ప్రాణాలు జంతువులకు షెల్టర్ జోన్‌గా వన్ తార ఉంది.
  • వన్ తారాలో 2వేలకుపైగా జాతుల వన్యప్రాణులు ఉన్నాయి.
  • వన్ తార అనేది వన్యప్రాణుల పునరావాసం, సంరక్షణ కేంద్రం.
  • అచ్చం జంతువుల సహజ ఆవాసాలను ప్రతిబింబించే ఆవాసాలను వన్ తారాలో  ఏర్పాటు చేశారు. వీటిలోనే వన్యప్రాణులకు పునరావాసం కల్పిస్తారు.
  • ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆస్పత్రి వన్ తారలో ఉంది.
  • వన్‌ తారలో దాదాపు 2.5 కోట్లకుపైగా మొక్కలను నాటారు.

Also Read :Beating With Slipper: మోకాళ్లపై కూర్చోబెట్టి, చెప్పుతో కొట్టి పనిష్మెంట్.. మాజీ సీఎం కూతురి నిర్వాకం

  • వన్య ప్రాణులు, అరుదైన జంతుజాలంపై రీసెర్చ్ చేసే విషయంలోనూ వన్ తార ఫోకస్ చేస్తోంది. ఇందుకోసం విదేశీ యూనివర్సిటీలు, ప్రఖ్యాత పరిశోధనా సంస్థలతో వన్ తార కలిసి పనిచేస్తోంది.
  • వన్ తారతో కలిసి పనిచేస్తున్న సంస్థల జాబితాలో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN), వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) వంటి సంస్థలతో వన్ తార చేతులు కలిపింది.
  • గత కొన్నేళ్లలో వన్ తార మన దేశంలో ఎన్నో  ఏనుగులు, మొసళ్లు, చిరుతలను రక్షించింది. ఎన్నో ఇతర జంతువులు, పక్షులను కూడా కాపాడింది.

Also Read :Producer Kedar Suicide : నాడు శ్రీదేవి.. నేడు కేదార్.. దుబాయ్‌లో ఫిబ్రవరిలోనే మిస్టరీ మరణాలు

  Last Updated: 04 Mar 2025, 02:23 PM IST