Ayodhya Railway Station : అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్‌ (Ayodhya Railway Station)ను ప్రధాని మోడీ (PM Modi) శనివారం ప్రారంభించారు. ఉదయం అయోధ్య కు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్‌ షో ద్వారా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. రైల్వే స్టేషన్‌ వరకు 15 […]

Published By: HashtagU Telugu Desk
Pm Modi

Pm Modi

ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్‌ (Ayodhya Railway Station)ను ప్రధాని మోడీ (PM Modi) శనివారం ప్రారంభించారు. ఉదయం అయోధ్య కు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్‌ ఆనందీ బెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్‌ షో ద్వారా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రైల్వే స్టేషన్‌ వరకు 15 కిలోమీటర్లు ఈ రోడ్‌ షో సాగగా.. దారి పొడవునా ప్రధానికి ప్రజలు ఘనం స్వాగతం పలికారు. అదే సమయంలో 1,400 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మోడీ అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉన్నారు.అంతకుముందు అమృత్‌ భారత్‌ రైల్లో విద్యార్థులతో కొంతసేపు ప్రధాని ముచ్చటించారు.

ఇక అమృత్ భారత్ రైళ్ల విషయానికి వస్తే..ఈ రైల్లో ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి. తక్కువ సమయంలోనే ఈ రైలు వేగాన్ని అందుకుంటుంది. ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇందులో 22 కోచ్‌లు ఉంటాయి. 12 సెకండ్‌ క్లాస్‌ త్రీటైర్‌ స్లీపర్‌ కోచ్ లు, 8 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉన్నాయి. రెండు గార్డు కంపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు కొన్నిసీట్లు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

Read Also : Kadiyam Srihari: 22 ల్యాండ్ క్రూజర్‌ కార్లను కొనడంలో తప్పేముంది: కడియం శ్రీహరి

  Last Updated: 30 Dec 2023, 01:19 PM IST