Underwater Metro: నేడు నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధాని ..రైలు మార్గం విశేషాలు..

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 10:49 AM IST

 

Underwater Metro: పశ్చిమ బెంగాల్(West Bengal) రాజధాని కోల్‌కతా(kolkata)లో నీటి అడుగు నడిచే మెట్రో రైలు(Underwater Metro) పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది(Hooghly River) గర్భంలో నిర్మించారు. అయితే, నదిలో ఈ మెట్రోరైలు మార్గం ఎంతదూరం విస్తరించి ఉంది? నదీ కింద ఎన్ని మీటర్లలోతులో దీనిని నిర్మించారు? దీనిలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి? ఒకవేళ మెట్రో రైలు మధ్యలో ఆగితే పరిస్థితి ఏమిటి? వంటి విషయాలను ప్రజల్లో ఆసక్తిరేపుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

నదీగర్భంలో రైలు మార్గం విశేషాలు..

.కోల్ కతా ఈస్ట్ – వెస్ట్ మెట్రో కారిడార్ కింద దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుంగ్లీ నదీగర్భంలో నిర్మించారు.
.కోల్ కతా ఈస్ట్ – వెస్ట్ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలో మీటర్లు. ఇందులో 10.8 కిలో మీటర్లు భూగర్భంలో ఉంటుంది.
.హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కిలో మీటర్ల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ నిర్మించారు.
.నదీగర్భానికి 16 మీటర్ల దిగువన, భూమిలో లోపలికి 32 మీటర్ల లోతులో దీన్ని నిర్మించారు.
.ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే 90 నిమిషాల సమయం పడుతుంది.
.అండర్ వాటర్ మెట్రో మార్గం ద్వారా ఈ ప్రయాణం 40 నిమిషాలకు తగ్గుతుంది.
.ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ATO) సిస్టమ్ ద్వారా మెట్రో నడుస్తుంది. అంటే మెట్రో డ్రైవర్ ఒక బటన్ నొక్కిన తర్వాత, రైలు ఆటోమేటిక్‌గా తదుపరి స్టేషన్‌కు చేరుకుంటుంది.
.ఈ మెట్రో రైలు కారిడార్ పరిధిలో ఆరు స్టేషన్లు కలిగి ఉంటుంది. అయితే, మూడింటిని నదీగర్భంలోనే కట్టారు.
.ప్రయాణికులు నదీగర్భం లోపలికి, బయటకు వేగంగా వచ్చిపోయేందుకు వీలుగా నిర్మించారు.
.పలుసార్లు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.
.ఒకవేళ మెట్రో రైలులో సమస్య తలెత్తి నదీగర్భంలో ఆగిపోయినా భయాందోళన అవసరం లేదు. పక్కనే నిర్మించేందుకు నడక మార్గాన్ని కూడా వినియోగించుకోవచ్చు.
.ప్రతీరోజూ కనీసం ఏదు లక్షల మంది ప్రయాణీకులు అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
.ఈ ప్రాజెక్టు ద్వారా కోల్ కతాలో ట్రాఫిక్ రద్దీ, వాయుకాలుష్యం తగ్గే అవకాశం ఉంది.
.ప్రపచంలో అనేక దేశాల్లో అండర్ వాటర్ రైల్వే ప్రయాణ సదుపాయం ఉంది.
.జపాన్ లోని సీకెల్ టన్నెల్ ప్రఖ్యాతిగాంచిన అండర్ వాటర్ రైల్వే టన్నెల్. దీని పొడవు ఏకంగా 53.85 కిలో మీటర్లు.
.తుర్కియేలోని ఇస్తాంబుల్ లో బోస్ఫోరన్ జలసంధి కింద అండర్వ వాటర్ టన్నెల్ నిర్మించారు. ఇది ఇస్తాంబుల్ లోని ఆసియా, యూరప్ భూభాగాలను కలుపుతుంది. దీని పొడవు 14 కిలో మీటర్లు.

read also : Zuckerberg Bunker : 2వేల కోట్లతో ఫేస్‌బుక్ ఓనర్ రహస్య బంకర్.. విశేషాలివీ