PM Modi : నేటి నుండి ధ్యానంలో ప్రధాని మోడీ..

స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో నేటి సాయంత్రం నుంచి జూన్ 1న మ.3 గంటల వరకు ప్రధాని మోడీ ధ్యానంలో కూర్చుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు పటిష్టమైన భద్రతను పెంచారు

  • Written By:
  • Publish Date - May 30, 2024 / 07:52 AM IST

గత కొద్దీ రోజులుగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా గడిపిన ప్రధాని మోడీ (PM Modi)..నేటి సాయంత్రం నుండి ధ్యానంలో కూర్చోబోతున్నారు. ఇందుకోసం ఈయన తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లనున్నారు. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో నేటి సాయంత్రం నుంచి జూన్ 1న మ.3 గంటల వరకు ప్రధాని మోడీ ధ్యానంలో కూర్చుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు పటిష్టమైన భద్రతను పెంచారు. 2 వేల మంది పోలీసులు పహారా కాయనున్నారు. గత ఎన్నికల్లో ప్రచారం ముగిసిన అనంతరం ఆయన కేదార్నాథ్ గుహలో ధ్యానం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానంలో కూర్చోబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజుతో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తవ్వగా, ఏడో దశ జూన్ 1న జరగనుంది. ఏడో దశలో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. వీటిలో ఉత్తరప్రదేశ్ (13 సీట్లు), బీహార్ (8 సీట్లు), పంజాబ్ (13 సీట్లు), జార్ఖండ్ (3 సీట్లు), చండీగఢ్ (1 సీటు), పశ్చిమ బెంగాల్ (9 సీట్లు), ఒడిశా (6 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (4 సీట్లు) ఉన్నాయి. అన్ని స్థానాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

ఈ చివరి దశలోనే ప్రధాని మోడీ పోటీ చేసే వారణాసి ఉండటం గమనార్హం. దీంతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, బీహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి పోటీ చేస్తున్నారు. ఏడో, చివరి దశ ఎన్నికల ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీలు తమ చివరి దశ ప్రచారానికి సిద్ధమయ్యాయి. నేడు ఒడిశాలోని భద్రలోక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, TG డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించనున్నారు. జూన్ 1న పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడే అవకాశం ఉంది. 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read Also : Team India Schedule: 2025 ఐపీఎల్ వ‌ర‌కు టీమిండియా ఫుల్ బిజీ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!