దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్ర నేత , ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ప్రజల్లో విపరీతంగా క్రేజ్ పెరిగిందని ఇండయా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే (Mood Of The Nation Survey ) తేల్చి చెప్పింది. దేశంలో NDA సర్కార్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. రెండుసార్లు భారీ విజయం సాధించిన బిజెపి..ఈసారి మాత్రం ప్రతిపక్ష పార్టీల నుండి గట్టి పోటీనే ఎదురుకుంది. 400 సీట్లు సాదిస్తుందని భావించినప్పటికీ కనీసం 300 సీట్లు కూడా సాధించలేకపోయింది. అయినప్పటికీ కొద్దీ పాటి తేడాతో అధికారం చేపట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం బిజెపి సర్కార్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్న క్రమంలో ఇండయా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. ఈ సర్వే లో ప్రజల్లో బిజెపి సర్కార్ ఫై నమ్మకం పెరిగిందా..? రాహుల్ క్రేజ్ పెరిగిందా.? తగ్గిందా..? అనే కోణంలో సర్వే చేయగా…ప్రజల్లో మోడీ సర్కార్ ఫై మరింత నమ్మకం పెరిగింది. ఇదే క్రమంలో రాహుల్ క్రేజ్ సైతం గతంలో కంటే విపరీతంగా పెరిగినట్లు తేలింది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయే కూటమే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వేలో తేలింది. ఈసారి ఎన్డీయే కూటమి ఆరు స్థానాలను మెరుగుపర్చుకుని 299 సీట్లు సంపాదిస్తుందని సర్వే చెప్పింది. ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మధ్య ఉన్న రేటింగ్ గ్యాప్ తగ్గింది. ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానంగా ప్రధాని మోదీకి 49శాతం మంది ఓటేస్తే…రాహుల్ గాంధీకి 22.4 శాతం మంది ఓటేశారు. ఇంతకు ముందు సర్వేతో పోలిస్తే మోదీకి ఆరు పాయింట్లు తగ్గగా..రాహుల్ కు ఎనిమిది పాయింట్లు పెరిగినట్లు తేలింది.
Read Also : CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి