Street Vendors : క్రెడిట్ కార్డును పొందాలంటే జాబ్‌తో పాటు మంచి సిబిల్ స్కోరు ఉండాలి. ప్రతినెలా నిర్దిష్ట ఆదాయం సంపాదించే వారికే క్రెడిట్ కార్డులు మంజూరవుతాయి. వీధి వ్యాపారులకు ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్లకు ప్రతినెలా ఫిక్స్‌డ్ ఆదాయం రాదు. వీధి వ్యాపారుల ఆదాయంలో భారీ హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రధాని మోడీ.. వారికి అండగా నిలవాలని డిసైడయ్యారు. వీధి వ్యాపారులకు సాయం చేసేందుకే ‘పీఎం స్వనిధి’ పథకాన్ని ప్రారంభించారు. 2020 జూన్‌లోనే ప్రారంభమైన ఈ స్కీం ద్వారా త్వరలో వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు.
Also Read :Pawan Kalyan: సినిమా థియేటర్‌లో లైవ్.. ప్రజలతో పవన్ వర్చువల్ ముఖాముఖి
క్రెడిట్ కార్డుల లిమిట్ ఎంత ?
గతంలో పీఎం స్వనిధి పథకం కింద మూడు విడతల్లో సకాలంలో రుణాలు చెల్లించిన వారికి, నాలుగో విడతలో క్రెడిట్ కార్డులు మంజూరు చేయనున్నారు. ఈ కార్డును పొందే వీధి వ్యాపారులు(Street Vendors) తమ అవసరాలకు అనుగుణంగా నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. తమ వ్యాపారానికి అవసరమైన సామగ్రిని, సరుకులను కొనుగోలు చేయొచ్చు. అయితే మళ్లీ నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఈవిధంగా వీధి వ్యాపారులకు ఇవ్వనున్న క్రెడిట్ కార్డుల లిమిట్ ఎంత ఉంటుంది ? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Also Read :Donald Trump Jr: రిపబ్లికన్ పార్టీ పిలుస్తోంది.. నేనూ అధ్యక్షుడిని అవుతా : ట్రంప్ కుమారుడు
రూ.80వేల దాకా ఇస్తారనే అంచనాలు
వడ్డీ వ్యాపారుల ఊబి నుంచి వీధి వ్యాపారులను కాపాడే గొప్ప సంకల్పంతో ఈ క్రెడిట్ కార్డులను జారీ చేయబోతున్నారు. గతంలోకి 2020 జూన్ నుంచి ఇప్పటివరకు ‘పీఎం స్వనిధి’ పథకం ద్వారా వీధి వ్యాపారులకు మూడు దశల్లో తక్కువ వడ్డీతో స్వల్పకాలిక రుణాలను ఇచ్చారు. తొలి విడతలో రూ.10 వేల లోన్ ఇచ్చారు. రెండోసారి రూ.20 వేలు, మూడోసారి రూ.50 వేలు చొప్పున లోన్స్ మంజూరు చేశారు. ఈసారి క్రెడిట్ కార్డులు ఇవ్వబోతున్నారు. కచ్చితంగా క్రెడిట్ లిమిట్ రూ.60వేల నుంచి రూ.80వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో వీధి వ్యాపారులు ఉన్నారు. వారంతా వీటి ద్వారా లబ్ధి పొందొచ్చు.