PM Modi Vs Kharge: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన తర్వాతే జమ్మూకశ్మీర్ పర్యటనను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు’’ అని ఖర్గే ఆరోపించారు.
Also Read :Kailash Yatra: కైలాస మానస సరోవర యాత్ర.. అర్హతలు, ఖర్చులివీ
‘‘నిఘా వర్గాల వైఫల్యం వల్లే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పుకుంది. అలాంటప్పుడు ఈ ఉగ్రదాడిలో పలువురు దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టకూడదా ?’’ అని కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు. ‘సంవిధాన్ బచావో’ పేరుతో ఇవాళ (మంగళవారం) జార్ఖండ్‌లోని రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జమ్మూకశ్మీరులో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాల నుంచి మూడు రోజులు ముందే సమాచారం అందిందని నేను విన్నాను. ఆ సమాచారం అందిన వెంటనే పహల్గాంలో అదనపు భద్రతా బలగాలను ఎందుకు మోహరించలేదు ?’’ అని ఆయన ప్రశ్నించారు.
Also Read :Earthquakes: ప్రకాశం జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది ?
‘‘మేం దేశానికే తొలి ప్రయారిటీ ఇస్తాం. పార్టీ అనేది తర్వాతి విషయం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై తీసుకునే చర్యల అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం’’ అని ఖర్గే(PM Modi Vs Kharge) స్పష్టం చేశారు. ‘‘రాజకీయ విభేదాలను పక్కనపెట్టి.. దేశం కోసం ఏకమై పనిచేస్తాం’’ అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడాన్ని మోడీ సర్కారు ఒక నిరంకుశ విధానంగా మార్చుకుందని ఖర్గే ధ్వజమెత్తారు. ఆదివాసీ నేతలను భయపెట్టే ధోరణిని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు.