బిహార్(Bihar )లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం (National Panchayati Raj Day) సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉగ్రవాదంపై స్పందిస్తూ దేశ ప్రజలకు ధైర్యం ఇచ్చారు. తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించిన మోదీ, అమాయక ప్రజలపై దాడులు చేసిన ఉగ్రవాదులు ఎక్కడ దాగినా వారిని వెలికి తీసి మట్టిలో కలిపే వరకు కేంద్రం నిద్రపోదని స్పష్టం చేశారు. ఈ దాడిని భారత్‌పై జరిగిన దాడిగా అభివర్ణించిన ఆయన, దాని వెనుకున్న వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
పహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందని మోదీ హామీ ఇచ్చారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయని ఆయన గుర్తు చేశారు. దేశ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వము అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని , బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించడం ద్వారా భవిష్యత్‌లో ఇలాంటి దాడులకు అవకాశమే లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
Shimla Agreement : ‘సిమ్లా ఒప్పందం’ నుంచి పాక్ వైదొలిగే ఛాన్స్.. ఏమిటిది ?
ఇక మరోవైపు మావోయిస్టులపై కూడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. “ఆపరేషన్ కగార్” పేరుతో సాగుతున్న ఈ స్పెషల్ ఆపరేషన్‌లో పోలీసులు భారీ స్థాయిలో కూంబింగ్ చేస్తున్నారు. కర్రెగుట్ట ప్రాంతాలను హెలికాప్టర్ల సాయంతో చుట్టుముట్టిన పోలీసు దళాలు, కీలక మావోయిస్టు నేతలు గుట్టలపై ఉన్నట్లు సమాచారం ఆధారంగా చర్యలు చేపట్టారు. మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ వల్ల మావోయిస్టుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే కీలక నేతలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.