Site icon HashtagU Telugu

Rajnath Singh : చైనా సైన్యాన్ని త‌రిమేసిన భార‌త ఆర్మీ: పార్ల‌మెంట్లో రాజ్ నాథ్

Rajnath Singh

Rajnath Prliament

చైనా సైన్యంలోని `పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ`(PLA) ని భార‌త సైన్యం త‌రిమికొట్టింది. భార‌త సైన్యం విరోచిపోరాటం కార‌ణంగా చైనా సైన్యం తోక‌ముడిచింది. వాస్త‌వాధీన రేఖ‌ను మార్చేయాల‌ని పీఎల్ ఏ (PLA)చేసిన ప్ర‌య‌త్నం చేసింది. క్ష‌ణాల్లో అప్ర‌మ‌త్త‌మైన భార‌త సైన్యం పీఎల్ ఏ ప్ర‌య‌త్నాన్ని తిప్పికొట్టింది. ఆ సంద‌ర్భంగా ఇరు దేశాల సైన్యాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. భార‌త సైన్యానికి ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. భార‌త సైనికులు ఎవ‌రూ చనిపోలేదు. తీవ్రంగా ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. చాక‌చ‌క్యంగా పీఎల్ ఏను తిరిగి వాళ్ల స్థానాల‌కు పంపించ‌డంలో భార‌త సైన్యం విజ‌యం సాధించింది. ఆ మేర‌కు భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)పార్ల‌మెంట్ లో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

భారత్, చైనా సైనికుల మధ్య అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లోని త‌వాంగ్ వ‌ద్ద జ‌రిగిన తాజా ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) మంగ‌ళ‌వారం పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ ఘర్షణలో భారత సైనికులెవరూ చనిపోలేదని, తీవ్రంగా గాయపడలేదని ఆయన తెలిపారు. “9 డిసెంబర్ 2022న, PLA (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా) దళాలు తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో LACని అతిక్రమించి, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించాయి. చైనా ప్రయత్నాన్ని మా దళాలు దృఢంగా మరియు దృఢంగా ఎదుర్కొన్నాయి.` అంటూ రాజ్ నాథ్ ప్ర‌క‌టించారు. ఆ త‌రువాత `ముఖాముఖి భౌతిక ఘర్షణకు దారితీసింది, దీనిలో భారత సైన్యం PLAని మన భూభాగంలోకి అతిక్రమించకుండా ధైర్యంగా నిరోధించింది . వారి స్థానాలకు తిరిగి వెళ్లేలా వారిని బలవంతం చేసింది` అంటూ వివ‌రించారు.

“కొట్లాట రెండు వైపులా కొంతమంది సిబ్బందికి గాయాలయ్యాయి. మా వైపు ఎటువంటి ప్రాణనష్టం లేదా తీవ్రమైన ప్రాణనష్టం జరగలేదని నేను ఈ సభతో పంచుకోవాలనుకుంటున్నాను.` అంటూ రాజ్ నాథ్ వెల్ల‌డించారు. “భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం కారణంగా, PLA సైనికులు వారి స్థానాలకు తిరిగి వెళ్లారు. చైనా పక్షం అటువంటి చర్యలకు దూరంగా ఉండాలని , సరిహద్దు వెంబడి శాంతి, ప్రశాంతతను కాపాడాలని కోరాం. ఈ సమస్యను దౌత్య మార్గాల ద్వారా చైనా వైపు కూడా తీసుకువెళ్లారు“ అంటూ రాజ్ నాథ్ పార్ల‌మెంట్ లో వెల్ల‌డించారు.

భార‌త్, చైనా స‌రిహ‌ద్దు వెంబ‌డి జ‌రుగుతోన్న అంశాల‌ను కులంకుషంగా చ‌ర్చించాల‌ని కాంగ్రెస్ నేత‌లు పార్ల‌మెంట్ వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు. 2020 ఏప్రిల్ ల‌ఢ‌క్ లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆక్ర‌మ‌ణ‌లు, అతిక్ర‌మ‌ణ‌లు, అక్ర‌మ నిర్మాణాలు స‌రిహ‌ద్దుల్లో జ‌రిగాయో చ‌ర్చించాల‌ని విప‌క్ష నేత‌లు కోరుతున్నారు. కానీ, తాజాగా తవాంగ్ వ‌ద్ద జ‌రిగిన సంఘ‌ట‌న గురించి మాత్ర‌మే రాజ్ నాథ్ సింగ్ పార్ల‌మెంట్ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు. కానీ, కాంగ్రెస్ తో పాటు విప‌క్షాలు మాత్రం భార‌త్, చైనా బోర్డ‌ర్ వ‌ద్ద జ‌రుగుతోన్న అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేయాల‌ని కోరారు. భార‌త భూభాగంలోకి గ‌తంలోనే చైనా సైన్యం వ‌చ్చింద‌ని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోప‌ణ‌. వాటి వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌డానికి గ‌తంలోనే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, ప్ర‌భుత్వం మాత్రం చైనా ఆక్ర‌మ‌ణ‌లు, అతిక్ర‌మ‌ణ‌ల‌ను దాచేస్తోంద‌ని కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది.