Prashant Kishor: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంగళవారం పాట్నాకు చేరుకున్నారు. విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు నేతలతో నితీశ్ భేటీ అయ్యారు.నితీష్ విపక్షాలతో జరిపిన భేటీపై పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ రియాక్ట్ అయ్యారు.
నితీష్‌ను ఉద్దేశించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. నేతలతో కూర్చుని టీ తాగడం వల్లనో, విలేకరుల సమావేశం నిర్వహించడం ద్వారానో ప్రతిపక్ష పార్టీలు ఏకం కావని అన్నారు. అలా జరిగేది ఉంటే 10 సంవత్సరాల క్రితమే జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. నిజానికి నితీశ్ ఏం చేస్తున్నారనే దానిపై పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని అయితే త్వరలో నితీష్ పరిస్థితి చంద్రబాబులా మారుతుందని ఆసక్తికర కామెంట్లు చేశాడు పీకే.
చంద్రబాబు ఒక దశలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నించాడు. దాని ఫలితంగా గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారని, 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకోగలిగారని పీకే అన్నారు. చివరికి చంద్రబాబు అధికారానికి దూరమయ్యాడను పీకే గుర్తు చేశాడు. నితీష్ కుమార్ ఇప్పటికే సంకీర్ణంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని స్పష్టం చేశాడు.
బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, మాంఝీ సహా మిత్రపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో నితీశ్ కుమార్ ఫార్ములా చెప్పాలని ప్రశాంత్ కిషోర్ అన్నారు. తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లండని విమర్శించారు. నిజానికి బీహార్ విషయంలో నితీష్ కుమార్ ఆందోళన చెందాల్సిన సమయమిది, ముందుగా బీహార్ ని కాపాడుకుని, తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని వ్యంగ్యాస్థ్రాలు సంధించారు. నితీష్ కుమార్ పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడులానే తయారువుందంటూ పీకే సంచలన కామెంట్స్ చేశారు.
Read More: CSK vs GT: తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై