డాక్టర్స్ , లాయర్లు ఫీజులు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. కాగా రాజకీయాల్లో కూడా వసూళ్లు చేస్తుంటారు కొంతమంది రాజకీయ వ్యూహకర్తలు. వారిలో ప్రముఖమైన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor). ఈయనను “పికే” (PK) అని కూడా పిలుస్తారు. మొదటగా 2014 లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విజయవంతమైన ఎన్నికల వ్యూహాన్ని రూపొందించి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తరువాత కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వైసీపీ, డీఎంకే వంటి పలు ప్రాంతీయ మరియు జాతీయ పార్టీలకు వ్యూహాలను రూపొందించారు. ప్రశాంత్ కిశోర్ తన సొంత సంస్థ అయిన ఐ-పాక్ (ఇండియన్ పాలిటికల్ యాక్షన్ కమిటీ) ద్వారా పార్టీలకు ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలు అందిస్తారు. ఐ-పాక్ అనేది రాజకీయ వ్యూహాలపై పనిచేసే ఒక ప్రొఫెషనల్ సంస్థగా పనిచేస్తుంది. ఐ-పాక్ సాయంతో, ఆయన పలు ముఖ్యమైన రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు. వాటిలో చాలా సక్సెస్ అయ్యాయి.
ప్రశాంత్ కిశోర్ వ్యూహాల ప్రత్యేకత ఏమిటంటే.. ఆయన ప్రజల మనోభావాలు, ప్రాధాన్యతలు, సమస్యలను అత్యంత నిశితంగా అధ్యయనం చేసి, వాటి ఆధారంగా వ్యూహాలు రూపొందిస్తారు. బూత్ స్థాయిలో డేటా సేకరణ, సోషల్ మీడియా ప్రచారం, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా ఆయన రాజకీయాలను మోడర్న్ పరిజ్ఞానం, సాంకేతికతతో సమ్మిళితం చేస్తారు. తన రాజకీయ వ్యూహాలలో సతత మార్పులు, కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి, ప్రశాంత్ కిశోర్ ప్రతి ఎన్నికలో కొత్తదనం తీసుకువస్తారు. అయన కేవలం ప్రచారం మీదే కాకుండా, ప్రజలతో నేరుగా సంప్రదింపులు, అభిప్రాయ సేకరణ, మరియు వారి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలను రాజకీయ వేదిక మీదకు తీసుకువచ్చే విధంగా వ్యూహాలు తయారు చేస్తారు. అందుకే అంత ఆయన నుండి సలహాలు తీసుకుంటుటారు. తాజాగా తన సలహా ఫీజును తెలిపి ఫీజులు పోయేలా చేసాడు. తాను ఒక రాష్ట్రంలో రాజకీయ సలహాలు ఇచ్చేందుకు ఫీజుగా రూ.100 కోట్ల వసూలు చేస్తానని ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించారు. బిహార్లో త్వరలో ఉప ఎన్నికలు జరగనుండగా బెలగంజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పది రాష్ట్రాల్లో తాను సలహాలు ఇచ్చిన ప్రభుత్వాలే గెలిచినట్లు తెలిపారు.
Read Also : Asaduddin : నేను నోరు విప్పితే బీఆర్ఎస్ వాళ్లు ఇబ్బందిపడతారు : అసదుద్దీన్