Site icon HashtagU Telugu

Smriti Irani Vs Gandhis : ఏ ఛానలైనా, ఏ యాంకరైనా ఓకే.. గాంధీలకు స్మృతి‌ ఇరానీ సవాల్

Smriti Irani Vs Priyanka Gandhi

Smriti Irani Vs Priyanka Gandhi

Smriti Irani Vs Gandhis : ఏ న్యూస్ ఛానలైనా ఓకే.. ఏ యాంకరైనా ఓకే.. ఏ స్థలమైనా ఓకే అంటూ ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలకు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సవాల్ విసిరారు.  ఏ విషయం మీదైనా మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గాంధీలు తనతో బహిరంగ చర్చకు రావాలన్నారు. ఏ అంశంపై చర్చించాలనేది కూడా గాంధీలే డిసైడ్ చేయాలని స్మృతీ ఇరానీ పేర్కొన్నారు.  దేశానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై ప్రధాని మోడీ ఎన్నడూ మాట్లాడలేదని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ  కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈ ప్రకటన చేశారు. ఎన్నికల టైంలో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని గాంధీలకు సూచించారు. తమ పార్టీ నుంచి గాంధీలకు సరైన సమాధానం చెప్పడానికి సుధాన్షు త్రివేది చాలని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఒక వైపు ఉంటారు.. బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మరోవైపు ఉంటారు. విషయమంతా క్లియర్ అయిపోతుంది. వాళ్లకు సరైన సమాధానం చెప్పడానికి సుధాన్షు త్రివేది  సరిపోతారు’’ అని స్మృతి ఇరానీ చెప్పారు., స్మృతి ఇరానీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని  అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీపై 55,000 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ తరఫున గాంధీ కుటుంబ సన్నిహితుడు  కిశోరీ లాల్ శర్మ బరిలోకి దిగారు. దీంతో ఇరానీకి పోటీ తగ్గిపోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Also Read :Kashmir Encounter : 40 గంటల సుదీర్ఘ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఈ ఏడాది ప్రారంభంలో సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కావడంతో  యూపీలోని రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. ఇంతకుముందు వరుసగా నాలుగుసార్లు రాయ్‌బరేలీ నుంచి సోనియా గెలిచారు. అందుకే ఈ దఫా పోటీకి సురక్షితమైన రాయ్‌బరేలీ స్థానాన్ని రాహుల్ గాంధీ(Smriti Irani Vs Gandhis) ఎంపిక చేసుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అమేథీ, రాయ్‌బరేలీ రెండు స్థానాలను కాంగ్రెస్ గెలిచింది. అయితే 2019లో ఒక్క రాయ్‌బరేలీలో మాత్రమే విజయం సాధించింది. ఈసారి కూడా రాయ్‌బరేలీలో గెలవాలనే పట్టుదలతో హస్తం పార్టీ ఉంది.

Also Read :Allu Arjun : పెళ్ళైనా అల్లు అర్జున్ ఇప్పటికీ వన్ సైడ్ లవరేనా..?