Site icon HashtagU Telugu

China Vs Philippines : గల్వాన్‌ను తలపించేలా.. గొడ్డళ్లతో ఆ సైనికులపై చైనా ఆర్మీ ఎటాక్

China Vs Philippines

China Vs Philippines

China Vs Philippines :  చైనాకు పొరుగుదేశాలపై నిత్యం అక్కసు ఉంటుంది. ఆ అక్కసు మరోసారి బయటపడింది. ఈసారి డ్రాగన్ తన విషాన్ని ఫిలిప్పీన్స్‌‌పై చిమ్మింది. సౌత్ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ సైనిక దళాల పడవలపై చైనా కోస్ట్‌ గార్డ్‌ సైనికులు దారుణంగా ఎటాక్ చేశారు. ఫిలిప్పీన్స్ సైన్యానికి చెందిన పడవలను కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో  ధ్వంసం చేసేందుకు యత్నించారు. సౌత్ చైనా సముద్రంలోని  సెకండ్‌ థామస్‌ షోల్‌ ప్రాంతంలో ఉన్న తమ సైనికులకు ఆహారం, ఇతర వస్తువులను తీసుకెళ్తుండగా చైనా సైనికులు(China Vs Philippines) అడ్డుకొని ఈ దాడికి తెగబడ్డారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

We’re now on WhatsApp. Click to Join

చైనా సైనికులు ఏకంగా ఫిలిప్పీన్స్ ఆర్మీకి చెందిన బోట్లలోకి ఎక్కారు. ఆ బోట్లలో ఉన్న ఎం4 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకొని వీరంగం క్రియేట్ చేశారు. ఆ బోట్లలోని నేవిగేషన్‌ పరికరాలను సీజ్‌ చేశారు. ఈ ఘటనలో ఫిలిప్పీన్స్‌ ఆర్మీలోని కొందరు సైనికులు గాయపడ్డారు. ఒక ఫిలిప్పీన్స్  సైనికుడి బొటనవేలు తెగిపోయింది. ఫిలిప్పీన్స్ పడవలు కదలకుండా బోట్లతో చైనా సైనికులు చుట్టుముట్టారు.

Also Read :110 Heatwave Deaths : 110 మందిని బలిగొన్న వడగాలులు.. 40వేల మంది ప్రభావితం

ఈ ఘటనపై ఫిలిప్పీన్స్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ రోమియో బ్రవ్నెర్‌ జూనియర్‌ తీవ్రంగా స్పందించారు. చైనా సైనికులు సముద్రపు దొంగల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. పదునైన ఆయుధాలను చేతపట్టి చైనా సైనికులు తమ సైనికులను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన తెలిపారు. తమ సైనికులు ఒట్టిచేతులతో చైనా సైనికులతో పోరాడాల్సి వచ్చిందన్నారు. తమ సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, సాంకేతిక పరికరాలను తక్షణమే తిరిగి ఇవ్వాలని ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ డిమాండ్ చేశారు. తమ సైన్యానికి నష్టం కలిగించినందుకు పరిహారాన్ని చెల్లించాల్సిన బాధ్యత చైనాపై ఉందన్నారు. సౌత్ చైనా సముద్రంలో తమ దళాల సంఖ్య తక్కువగా ఉన్నా, ధైర్యంగా చైనాపై పోరాడాయని ఆయన  కితాబిచ్చారు.

Also Read : Amaravati : అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం – సీఎం చంద్రబాబు

తమ సైన్యం ఆగడాలను చైనా విదేశాంగ శాఖ సమర్దించుకుంది. ఫిలిప్పీన్స్ దళాలు పడవలో అక్రమంగా ఆయుధాలు తీసుకెళ్తుంటే తాము ఆపామని, ఇంకేం చేయలేదని స్పష్టం చేసింది. ఫిలిప్పీన్స్ సైనికులపై తాము దాడి చేయలేదని తేల్చి చెప్పింది.  కోస్ట్‌గార్డ్‌ చట్టంలోని కొత్త నిబంధనల ప్రకారమే తమ సైనికులు నడుచుకున్నారని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.  దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం రెండూ తనవేనని చైనా వాదిస్తోంది. అందుకే ఆ సముద్రాల్లోకి వచ్చే పొరుగు దేశాల సిబ్బందిని చైనా ఇబ్బందిపెడుతోంది.