PF From ATM : ఉద్యోగ భవిష్యనిధి(పీఎఫ్) అకౌంటు కలిగిన వారందరికీ గుడ్ న్యూస్. పీఎఫ్ అకౌంటు నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోవడం త్వరలోనే మరింత ఈజీ కానుంది. నేరుగా ఏటీఎం సెంటరుకు వెళ్లి పీఎఫ్ ఖాతాలోని డబ్బులను విత్‌డ్రా చేసుకునే ఛాన్స్ లభించనుంది. ఈవిషయాన్ని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దావ్రా తెలిపారు. 2025 సంవత్సరం జనవరి నుంచే ఈ సేవలను పీఎఫ్ అకౌంట్లు(PF From ATM) కలిగిన వారంతా వాడుకోవచ్చని సమాచారం. ఒకవేళ ఆలస్యమైతే.. ఏటీఎంల నుంచి పీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం వచ్చే సంవత్సరం మార్చిలోగా అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.
Also Read :India Vs Bangladesh : 40 రాఫెల్స్ రెడీ.. బంగ్లాదేశ్‌పైకి రెండు పంపితే సరిపోతుంది.. సువేందు అధికారి వార్నింగ్
ఇందుకు అనుగుణంగా ఈపీఎఫ్ఓలోని ఐటీ వ్యవస్థలను అధునాతన టెక్నాలజీతో ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో దీని ఫలితాలను పీఎఫ్ అకౌంట్లు కలిగిన వారు చూస్తారని అధికార వర్గాలు తెలిపాయి. పీఎఫ్ క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించే దిశగానూ మరిన్ని సంస్కరణలను అమలు చేస్తారని తెలిసింది. ఉద్యోగం చేస్తుండగా పీఎఫ్ నగదును పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేయడానికి కుదరదు. కనీసం నెల రోజులుగా ఉద్యోగం లేకపోతే.. పీఎఫ్ బ్యాలెన్సులోని 75 శాతం దాకా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. కనీసం రెండు నెలలుగా జాబ్ లేకపోతే.. మొత్తం పీఎఫ్ బ్యాలెన్సును విత్ డ్రా చేసుకునేందుకు ఉద్యోగికి అర్హత లభిస్తుంది.
Also Read :Fake Protein Supplements : నకిలీ ప్రొటీన్ సప్లిమెంట్లను దేనితో తయారు చేస్తారో తెలుసా..?
ప్రైవేట్ రంగంలోని కొత్త ఉద్యోగుల కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను యాక్టివేట్ చేయడానికి గడువును ఈపీఎఫ్ఓ పొడిగించింది. వారు తమ UAN, బ్యాంక్ ఖాతాను డిసెంబర్ 15లోగా ఆధార్‌తో లింక్ చేయాలి. UANని యాక్టివేట్ చేయడం ద్వారా ఉద్యోగులు ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) స్కీమ్ ప్రయోజనాలను పొందొచ్చు. UAN నంబర్‌తో ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ అయితేనే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) సాధ్యమవుతుంది.