Site icon HashtagU Telugu

Duplicate Virat Kohli : అయోధ్యలో డూప్లికేట్ కోహ్లీ..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం

Virat Kohli's Duplicate In

Virat Kohli's Duplicate In

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం.. వినడమే తప్ప..చూసింది ఏం లేదు.. సినిమాల్లో చూపిస్తారు అంతే.. అసలు నిజంగా ఉంటారా..? ఉంటే వాళ్లు ఎక్కడ ఉంటారు.. వాళ్లు నిజంగా ఒకేలా ఉంటారా..? ఇలా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతాయి. కాకపోతే సేమ్ ఒకేలా ఉండరు..కాస్త కొన్ని ఛాయలు మాత్రం ఒకేలా కనిపిస్తాయి. ఈ మధ్య ఇలాంటి పోలిన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఈరోజు అయోధ్య (Ayodhya ) లో డూప్లికేట్ కోహ్లీ (Duplicate Virat Kohli) కనిపించేసరికి నిజంగా కోహ్లీ అనుకోని..జనం ఎగపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు అయోధ్య లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడింది. రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడు (Bala Ram) కొలువు దీరారు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని కళ్లారా చూడటానికి సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అచ్చం ఇదే తరహాలో ఇద్దరు డూప్లికేట్ క్రికెటర్లు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి విచ్చేసి సందడి చేసారు. వారిలో ఒకరు సచిన్ టెండూల్కర్ కాగా, మరొకరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ మాదిరి గెటప్ వేసుకొని ఓ అభిమాని అయోధ్యకు రావడం తో అతనితో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. నడిరోడ్డుపై కూడా అతన్ని విడిచిపెట్టలేదు. వదిలితే ఎక్కడకి పారిపోతడేమో అన్నట్లు అతని చుట్టూ చేరి, సెల్ఫీ లు కోసం పోటీపడ్డారు.

Read Also : Suryoday Yojana Scheme : ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోడీ భారీ పథకం ప్రకటన..