Site icon HashtagU Telugu

AI Vs Job Cuts : ఏఐ ఎటాక్.. పేటీఎంలో వందలాది జాబ్స్ కట్

Balance Check

Balance Check

AI Vs Job Cuts : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దెబ్బకు జాబ్స్ పోతున్నాయి. పేటీఎం మాతృసంస్థ ‘వన్‌ 97 కమ్మూనికేషన్‌’ తాజాగా  వివిధ విభాగాల్లో దాదాపు 1,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. పేమెంట్స్‌, సేల్స్‌, ఆపరేషన్స్‌ వంటి విభాగాలలో ఈ జాబ్ కట్స్ జరిగాయి. ఈవిధంగా ఉద్యోగుల తొలగింపుతో పేటీఎంలోని మొత్తం మానవ వనరుల్లో 10 శాతం మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. సిబ్బంది కోసం చేస్తున్న ఖర్చులలో 15 శాతం మేర తగ్గించే లక్ష్యంతో ఈవిధంగా ఉద్యోగులను తొలగించామని పేటీఎం వర్గాలు చెబుతున్నాయి. పేమెంట్స్‌, సేల్స్‌, ఆపరేషన్స్‌ వంటి విభాగాలలో ఏఐ టెక్నాలజీతో ఆటోమేషన్‌ ప్రక్రియను ప్రవేశపెట్టేందుకు పేటీఎం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఆ తర్వాతే జాబ్ కట్స్ దిశగా నిర్ణయం తీసుకుంది. ఏఐ ఆటోమేషన్ వల్ల పేటీఎం కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గడంతో పాటు ఆపరేషన్ సామర్థ్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీలోని 10 శాతం మంది ఉద్యోగులకు ఇచ్చే శాలరీలలో సగం కంటే తక్కువ ఖర్చుతోనే ఏఐ ఆటోమేషన్ టెక్నాలజీని పేటీఎం(AI Vs Job Cuts) అందుబాటులోకి తెచ్చిందని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

పేమెంట్స్ బిజినెస్, బీమా పాలసీలు, లోన్ మంజూరు వంటి సేవలపై ప్రస్తుతం పేటీఎం ఫోకస్ చేస్తోంది. ఈపనులను ఆటోమేషన్ ద్వారా నిర్వహించే ఏఐ సాఫ్ట్‌వేర్‌లు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వాటిని వాడుకునేందుకే పేటీఎం సమాయత్తమైంది. Microsoft, Google AI టూల్స్‌ను కూడా ఈ కంపెనీ బాగా వాడుకుంటోంది. గతంలో 2021 సంవత్సరంలోనూ Paytm దాదాపు  700 మంది ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించింది. మనదేశంలోని చిన్న నగరాలు, పట్టణాలలో వ్యాపారులను పేటీఎం వైపు అట్రాక్ట్ చేసేందుకు 50,000 మందికిపైగా సేల్స్ పర్సన్స్‌తో భారీ ప్రాజెక్టును పేటీఎం నడిపింది. అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం దక్కలేదని తెలుస్తోంది.

Also Read: Airport Jobs : ‘ఎయిర్‌పోర్ట్స్’‌లో 119 జాబ్స్.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు