గత రెండు నెలలుగా పరకాల ప్రభాకర్ మీడియా లో హైలైట్ అవుతూ వస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన లేకపోయినా అన్ని విషయాల్లోనూ ఆయనకు తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బిజెపి సర్కార్ ఫై కీలక విమర్శలు చేయడంపై అందరు మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పదేళ్లలో బిజెపి సర్కార్ చేసింది ఏమిలేదని..బిజెపి తీసుకున్న నిర్ణయాలతో దేశ ప్రజలు ఎంతో బాధపడుతున్నారని.. 2014లో మొదటి సారి గెలిచినప్పుడు యూపీఏ రెండు విడతల ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత తో పాటు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగ ఏదో సాధంచారన్న ఓ ప్రచారాన్ని ఉద్దృతంగా చేయడం వల్లనే విజయం సాధించిందని తెలిపారు. 2019 సమయంలో పుల్వామా ఉగ్రదాడిని రాజకీయంగా వాడుకున్నారు. జవాన్ల మరణాలను రాజకీయంగా వాడుకుని దేశభక్తి పేరుతో రాజకీయం చేసి గెలిచారని పరకాల ప్రభాకర్ చెప్పుకొచ్చారు. పరిపాలన ఎంత వరస్ట్ గా ఉందో చూసిన తర్వాత ప్రజలు ఎందుకు ఓట్లేస్తారని ప్రశ్నించారు. అలాగే ఈసారి ఎన్నికల్లో బిజెపి గెలుపు కష్టమే అన్నారు. ఇంకేమన్నారో..పూర్తి ఇంటర్వ్యూ లో చూసెయ్యండి.
Read Also : TG : నా భూతొ న భవిష్యత్ అనే రేంజ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు – సీఎస్ శాంతికుమారి
