Site icon HashtagU Telugu

Parag Tradition : హమ్మయ్య.. మధ్యప్రదేశ్ లో వింత ఆచారానికి బ్రేక్ !!

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని సాగర్ జిల్లాలోని లాలోయి గ్రామం (Laloi Village) 17 సంవత్సరాలుగా పెళ్లిళ్లకు నోచుకోలేకపోయింది. దీనికి కారణం అక్కడి ప్రత్యేకమైన “పరాగ్ సంప్రదాయం” (Parag Tradition). ఈ సంప్రదాయం ప్రకారం.. గ్రామంలో ఎవరైనా హత్య లేదా గోవధ వంటి నేరాలకు పాల్పడితే, ఆ గ్రామంలో పెళ్లిళ్లు చేయడాన్ని ఆపేస్తారు. నేరం చేసిన వ్యక్తి కుటుంబం తీర్థయాత్ర చేసి, తులసి-శాలిగ్రామ్ వివాహం నిర్వహించి, విందు ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే ఈ నిషేధాన్ని ఎత్తివేస్తారు. అయితే ఈ ప్రక్రియ ఖరీదైనది కావడంతో పేదవారికి అది సాధ్యం కావడం లేదు.

APSRTC : ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి .. ఇద్దరు సీరియస్

ఈ సంప్రదాయం వల్ల లాలోయి గ్రామంలో పేద కుటుంబాల కూతుళ్లకు వివాహం జరగక పోవడంతో వారు తీవ్రంగా నలిగిపోయారు. ధనవంతులు బయట గ్రామాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నా, పేదలు ఆర్థికంగా వెనుకపడి ఉండటంతో తమ కుమార్తెలను పెళ్లి చేయలేక నిరీక్షణలో ఉండేవారు. అయితే గ్రామ సర్పంచ్ బాదల్ సింగ్ నాయకత్వంలో గ్రామస్తులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. రూ.3 లక్షల విరాళాలు సేకరించి, సమీప గిరిజన గ్రామానికి చెందిన మాన్సి అనే యువతిని లాలోయిలో వివాహం చేయించారు. ఈ విధంగా పరాగ్ నిషేధాన్ని తొలగించి, వివాహాలకు మార్గం వేసారు.

Plane Crash : మేడే కాల్ అంటే ఏంటి..? ఏ పరిస్థితుల్లో ఈ కాల్ పంపుతారు..?

ఈ ఘట్టం లాలోయి గ్రామానికి కొత్త శకాన్ని తీసుకువచ్చింది. 17 ఏళ్ల అనంతరం మొదటి పెళ్లి శుభగడియలు మోగడంతో గ్రామం ఉత్సాహంగా మారింది. ఈ పెళ్లి వేడుకకు ఖురై ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి భూపేంద్ర సింగ్ హాజరై, మూఢనమ్మకాల వల్ల ఆడపిల్లల జీవితాలు నాశనం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. సమాజం ఇప్పుడు ఇలాంటి మూఢసంప్రదాయాలను విడిచిపెట్టి, సాంకేతికత, నూతన ఆలోచనలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ ఘటన అందిస్తోంది.