Pakistani nationals: జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని పహల్గాంలో ఈనెల 22న జరిగిన ఉగ్రదాడిలో 26మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడితో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలకు సంబంధం ఉందని తేలిన తరువాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేలా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. మరోవైపు.. భారతదేశంలో స్వల్పకాలిక వీసాలు పొందిన పాకిస్తానీ పౌరులందరూ ఏప్రిల్ 27 నాటికి దేశం విడిచి వెళ్లాలని కేంద్రం నోటీసు జారీ చేసింది. వైద్య వీసాల భారత్ కు వచ్చిన వారు ఏప్రిల్ 29 నాటికి దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Sleeping Prince : 20 ఏళ్లుగా కోమాలో ‘స్లీపింగ్ ప్రిన్స్’.. ఎవరు ? ఎందుకు ?
ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వెంటనే వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి.. ఈ విషయమై దిశానిర్దేశం చేశారు. కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు పాక్ పౌరులను గుర్తించి, వెళ్లిపోవాలని సూచించాయి. ఈ క్రమంలోనే అనేక మంది పాకిస్థాన్ జాతీయులు అటారీ- వాఘా సరిహద్దు గుండా తిరుగుబాట పట్టారు. మూడు రోజుల్లో 509 మంది ఈ సరిహద్దు గుండా దేశం దాటారు. మరోవైపు.. పాకిస్థాన్ లోని 745 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.
Also Read: KCR Speech Highlights: నేను కొడితే మామూలుగా ఉండదు.. వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ ఇవే!
భారత్ లోని కొందరు పాకిస్థానీయులు తిరిగి తమ దేశానికి వెళ్లేందుకు ససేమీరా అంటున్నారు. పాకిస్థాన్ లో అన్ని ఆస్తులు అమ్ముకొని భారతదేశంకు వచ్చామని, ఇప్పుడు ఉన్నట్లుండి వెళ్లిపోండి అంటే ఎలా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పరిస్థితుల్లో కేంద్రం తాజాగా కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వచ్చిన ‘ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్- 2025’ ప్రకారం.. గడువు తీరిపోయినా భారతదేశంలోనే ఉండటం, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను సందర్శించడం వంటి సందర్భాల్లో మూడేళ్ల జైలుశిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పాక్ జాతీయురాలు సీమా హైదర్‌ను దేశం నుంచి బహిష్కరిస్తారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఇటీవల ఆమె స్పందిస్తూ.. తనకు పాక్ వెళ్లే ఉద్దేశం లేదని, ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగిలకు విజ్ఞప్తి చేస్తూ వీడియోను విడుదల చేసింది. 2023లో తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకున్నప్పుడే తాను హిందూమతాన్ని స్వీకరించానని తెలిపింది. ప్రస్తుతం, సీమా హైదర్ తన రెండవ భర్త సచిన్ మీనాతో కలిసి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసిస్తున్నారు.
అయితే, సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్ కు తిరిగి పంపించాలని డిమాండ్ చేశాడు. గులాం హైదర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో కొన్ని నిమిషాల వీడియోను పోస్టు చేశారు. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. సీమా హైదర్ కూడా తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించింది. నేను మోడీజీకి, జైశంకర్‌జీకి చెప్పాలనుకుంటున్నాను. సీమా హైదర్‌కు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. నలుగురు పిల్లలూ నిర్దోషులు, వారు పాకిస్తాన్ పౌరులుష వారిని వెంటనే పాకిస్థాన్ పంపించాలని కోరాడు.