Shehbaz Sharifs Ancestors: షెహబాజ్ షరీఫ్.. పాకిస్తాన్ ప్రధానమంత్రి. ఆయన పూర్వీకులు కశ్మీరీ పండిట్లట. వీరి పూర్వీకుల మూలాలు మరెక్కడో కాదు.. మన కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోనే ఉన్నాయట. ఈవివరాలను ‘‘పాకిస్తాన్ ఎ హార్డ్ కంట్రీ’’ అనే పుస్తకంలో బ్రిటీష్ రచయిత లైవెన్ అనటోల్ ప్రస్తావించారు. పూర్తి అధ్యయనం తర్వాతే ఈ వివరాలను తన పుస్తకంలో ఆయన పొందుపరిచారట. ఈ పుస్తకం ప్రకారం.. షెహబాజ్ షరీఫ్ పూర్వీకులు కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నుంచి అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న ‘‘జాతి ఉమ్రా’’ గ్రామానికి వలసవెళ్లారట. జాతి ఉమ్రా గ్రామంలో షరీఫ్ పూర్వీకులకు ఒక పెద్ద భవనం ఉండేది.
Also Read :Terror Plans Case: సూసైడ్ ఎటాక్‌కు సిరాజ్, సమీర్ ప్లాన్.. సిరాజ్ ఖాతాలో రూ.42 లక్షలు!!
అబ్బాస్ షరీఫ్ ఏం చేసేవారంటే..
షెహబాజ్ షరీఫ్ సోదరుడు అబ్బాస్ షరీఫ్(Shehbaz Sharifs Ancestors) ఒక వ్యాపారవేత్త. ఆయన తరచూ ‘‘జాతి ఉమ్రా’’ గ్రామానికి వచ్చేవారు. 1976లో తమ భవనాన్ని ‘‘జాతి ఉమ్రా’’ గ్రామానికి అబ్బాస్ విరాళంగా ఇచ్చారు. 2013లోనే అబ్బాస్ షరీఫ్ మరణించారు. ‘‘జాతి ఉమ్రా’’ గ్రామంలో ఉన్న షెహబాజ్ షరీఫ్, అబ్బాస్ షరీఫ్ పూర్వీకుల భవనం ఇప్పుడు గురుద్వారాగా మారింది. భక్తులకు ఉచితంగా భోజనం అందించే ఒక లంగర్ హాల్‌ను అందులో నిర్మిస్తున్నారు. షెహబాజ్ షరీఫ్ కుటుంబానికి ఈ ఊరు అంటే ఎంతో ఇష్టమని స్థానికులు చెబుతున్నారు. నవాజ్ షరీఫ్ పూర్వీకుల సమాధులు కూడా జాతీఉమ్రాలో ఇంకా అలాగే ఉన్నాయని తెలిపారు. నవాజ్ షరీఫ్ మనవడు జైద్ హుస్సేన్ నవాజ్ పెళ్లి జాతీఉమ్రాలోనే జరిగిందని గుర్తు చేస్తున్నారు. చాలా కాలం పాటు ఈ ఊరి ప్రజలు వారి కుటుంబంతో సంబంధాలను కొనసాగించారు.‘‘జాతి ఉమ్రా’’ గ్రామానికి షరీఫ్ కుటుంబం చాలానే చేసింది. గ్రామస్థుల కోరిక మేరకు ఊరిలో 2013లో స్టేడియం నిర్మించారు. మొత్తం మీద పాకిస్తాన్‌కు చెందిన షరీఫ్ ఫ్యామిలీకి కూడా భారత్‌తో లింకులు ఉన్నాయని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని గురించి ఇంటర్నెట్‌లో సెర్ఛ్ చేస్తున్నారు.