Terrorists : ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మతతత్వాన్ని ఆయుధంగా మార్చుకుంటూ భారత్‌పై నిరంతరం విద్వేషాన్ని చిమ్ముతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా ఎత్తిచూపేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీల బృందాలు ప్రపంచ దేశాలకు వెళ్ళి, పాక్ కపట స్వరూపాన్ని ప్రపంచానికి వెల్లడించే మిషన్‌లో నిమగ్నమయ్యాయి. ఈ దౌత్య యాత్రల్లో భాగంగా, బీజేపీ సీనియర్ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్‌ను సందర్శిస్తోంది. ఈ బృందంలో ప్రముఖంగా ఉన్న జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పాక్ ఉగ్రవాద సంబంధాలపై తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌లోనే ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారని ధ్వజమెత్తారు.
Read Also: Milla Magee : మిల్లా ఆరోపణలపై విచారణకు రేవంత్ ఆదేశం.. ఐదు అంశాలపై దర్యాప్తు
బహ్రెయిన్‌లోని సామరస్య వాతావరణాన్ని ప్రశంసించిన ఆయన, “ఇది మినీ ఇండియాలా ఉంది. ఇక్కడ మతాలు వేరు అయినా, ప్రజల్లో ఐక్యత అపూర్వంగా ఉంది,” అన్నారు. అఖిలపక్ష బృందం ఏకమై దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని చెప్పారు. తమంతా వేర్వేరు పార్టీలకు చెందినవారైనా, దేశ ప్రయోజనాల కోసం ఒకటైనామని చెప్పారు. ఇది పాక్‌కు చాలా పెద్ద భేదంగా నిలుస్తుందన్నారు. “పాకిస్థాన్ మతపరమైన భావజాలంతో ఏర్పడిన దేశం అయినప్పటికీ, అక్కడ ప్రజల్లో ఐక్యత లేదు. మత ఘర్షణలు, ఉగ్రవాద భావజాలమే అక్కడి రాజకీయ వ్యవస్థకు ఆధారంగా మారాయి,” అంటూ ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన శాంతి యత్నాలను కూడా ఆయన ప్రస్తావించారు. పాక్ నేతలతో పలు మార్లు శాంతి చర్చలు జరిపేందుకు భారత్ ప్రయత్నించినా, ప్రతిసారి పాక్ వెన్నులో చీమ కూర్చినట్టు దౌర్జన్యాన్ని చూపిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కీలక ఘట్టంగా నిలిచింది. ఈ ఆపరేషన్‌లో భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పాటు పాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని వాయుసేన దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సాధారణ పౌరులకు ఎటువంటి హాని కలగకుండా సున్నితంగా ప్రణాళిక రచించబడినదని గులాం నబీ ఆజాద్ వివరించారు. కానీ, పాక్ మాత్రం భారత సరిహద్దుల్లో నివసిస్తున్న పౌరులపై నిర్దాక్షిణ్యంగా దాడులకు పాల్పడిందని ఆయన వాపోయారు. భారత ప్రభుత్వం ఇప్పుడది దౌత్య యుద్ధానికి రంగం సిద్ధం చేసింది. ఉగ్రవాదంపై భారత్ చేపట్టిన పోరాటాన్ని ఇతర దేశాలకు వివరించేందుకు ఎంపీల బృందాలను విదేశాలకు పంపుతోంది. ఈ ప్రయత్నం ద్వారా పాక్‌ను మేకఅవతారం వేస్తున్న రాక్షసునిగా ప్రపంచం ముందు నిలబెట్టాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. భారత్ శాంతికి ప్రాధాన్యం ఇచ్చే దేశం. కానీ తన భద్రతకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకోవడంలోనూ వెనుకాడదు. ఈ నేపథ్యంలో భారత వైఖరిని సమర్థంగా ప్రపంచానికి వివరిస్తూ పాక్ మానవ హక్కుల ముసుగులో దాగిన ఉగ్రవాద మనస్తత్వాన్ని ఎండగట్టేందుకు ఈ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి.
Read Also: Kavitha Politics : కవిత విమర్శలపై కేటీఆర్‌కు కేసీఆర్ ఏం చెప్పారంటే..