Site icon HashtagU Telugu

Terrorist Camps : బార్డర్‌లో పాక్ ఉగ్ర శిబిరాలు యాక్టివ్.. లిస్ట్ విడుదల

Terrorist Camps In Indian Border

Terrorist Camps : భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ అయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) కేంద్రంగా కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడి హల్‌చల్ చేస్తున్నారు. అందువల్లే గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో ఉగ్రదాడులు పెరిగాయని భారత సైన్యం తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్ సరిహద్దుల్లో శిబిరాలు(Terrorist Camps) నిర్వహిస్తున్న పాక్ ఉగ్రవాద సంస్థలకు అక్కడి ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయని గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join

భారత్ సరిహద్దుల్లోని ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, పాక్ ఆర్మీ మాజీ సభ్యులు, కిరాయి సైనికులు(Pakistan funding) ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈశిబిరాల నిర్వహణకు అవసరమైన లక్షలాది రూపాయలు పాకిస్తాన్ ప్రభుత్వం మంజూరు చేస్తోందని తేలింది. ఈ ఉగ్రవాదులకు M4 రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్‌ వంటివి కూడా అందిస్తోందని గుర్తించారు. సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబాటు సమయంలో ఉగ్రవాదులకు సహాయపడే వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల దాకా పాక్ సర్కారు ఇస్తోందని భారత సైన్యం ఆరోపిస్తోంది. ఉగ్రవాదులు Icom రేడియో సెట్ల ద్వారా Samsung ఫోన్‌లు, Y SMSలను ఉపయోగిస్తున్నట్లు తేలింది.

Also Read :Ajit Pawar : అజిత్‌ పవార్‌కు శరద్ పవార్ షాక్.. నలుగురు అగ్రనేతలు జంప్

వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో అధ్యయనం 

ఇటీవల కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో విచారణ నిర్వహించిన భారత సైన్యం ఈవివరాలను గుర్తించింది. పాక్ ఉగ్రవాదులు భారతలోకి చొరబడటానికి అంతర్జాతీయ సరిహద్దు లేదా ఇతర మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు  తేలింది. అందుకే సరిహద్దుల్లో ఉన్న అన్ని కంచెలు, సొరంగాలను ప్రస్తుతం భారత బీఎస్ఎఫ్ విభాగం తనిఖీ చేస్తోంది.  ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి చొరబడిన తర్వాత తమకు ఆహారం, ఇతర అవసరాలకు సహాయం చేసే వారికి రూ.5 వేలు-6 వేల వరకు ఇస్తున్నట్లు విచారణలో గుర్తించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల కుటుంబాలకు అక్కడి సైన్యం నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లు వెల్లడైంది.

భారత బార్డర్‌లోని ఉగ్రవాద శిబిరాల జాబితా