Chandrayaan-3 Success: భారత్ చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతం (Chandrayaan-3 Success) కావడంతో ప్రపంచమంతా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)ని ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో శత్రు దేశం పాకిస్థాన్ (Pakistan) కూడా ఇస్రో శాస్త్రవేత్తలను పొగడకుండా ఉండలేకపోయింది. చంద్రయాన్-3 మిషన్ విజయాన్ని ‘గొప్ప శాస్త్రీయ విజయం’గా అభివర్ణిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలను పాకిస్తాన్ ప్రశంసించింది. ధనిక దేశాలతో పోలిస్తే తక్కువ బడ్జెట్‌తో భారత్ ఈ ఘనత సాధించిందని పాకిస్థాన్‌కు చెందిన ప్రధాన దినపత్రికలు ప్రశంసించాయి. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడుతూ.. ఇది గొప్ప శాస్త్రీయ విజయం అని మాత్రమే నేను చెప్పగలను. ఇందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అభినందనీయులు అని చెప్పారు.
పాకిస్థానీ పత్రిక చారిత్రాత్మకంగా చెప్పింది
భారతదేశం సాధించిన చారిత్రాత్మక విజయాన్ని పాకిస్తాన్ అధికారికంగా పట్టించుకోలేదు. అయితే, పాకిస్థానీ వార్తాపత్రికలు ఈ చారిత్రాత్మక క్షణానికి మొదటి పేజీ హోదాను ఇచ్చాయి. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రికలలో ఒకటైన ‘డాన్’ తన సంపాదకీయంలో చంద్రయాన్-3 మిషన్ విజయాన్ని ‘భారత అంతరిక్ష పరిశోధన’లో చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించింది.
Also Read: INDIA – Social Media : సోషల్ మీడియా అస్త్రంపై ‘ఇండియా’ కసరత్తు.. త్వరలో కూటమికి కొత్త లోగో
భారత్ నుంచి పాకిస్థాన్ నేర్చుకోవాలి
భారతదేశ అంతరిక్ష కార్యక్రమ విజయానికి కీలకం బహుశా ప్రభుత్వం నుండి నిరంతర మద్దతు అని వార్తాపత్రిక తన సంపాదకీయంలో రాసింది. అలాగే, ఈ కష్టతరమైన మిషన్‌ను సాధ్యం చేయడంలో సహాయపడిన ఇంజనీర్లు, శాస్త్రవేత్తల నాణ్యత, అంకితభావం ముఖ్యమైనది అని రాసుకొచ్చింది. భారతదేశం అంతరిక్ష కార్యక్రమం విజయం నుండి పాకిస్తాన్ నేర్చుకోవలసింది చాలా ఉండవచ్చు. పాకిస్తాన్ అంతరిక్ష కార్యక్రమం భారతదేశానికి ముందే ప్రారంభించబడింది. కానీ నిరాడంబరమైన విజయాన్ని సాధించిందని పేర్కొంది.
ఇక పొరుగున ఉన్న మరో దేశం చైనా ఇప్పటి వరకు స్పందించలేదు. ఇటీవల బ్రిక్స్ సమావేశం జరిగినప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఉన్నారు. కానీ ఆ దేశం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే చైనా ఇప్పటికే చంద్రుడి ఉత్తర ధ్రువంపై దిగిన దేశంగా నిలిచింది. దక్షిణ ధ్రువంపై భారత్ మాత్రమే అడుగుపెట్టడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.