White House : మేం పిలువలే.. పాకిస్తాన్ ఇజ్జత్ తీసిన అమెరికా..

White House : పాకిస్థాన్ మరోసారి తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకునే యత్నంలో దారుణ పరాజయం పాలైంది.

Published By: HashtagU Telugu Desk
Us Pakistan Relations

Us Pakistan Relations

White House : పాకిస్థాన్ మరోసారి తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయంగా తమ ఉనికిని చాటుకునే యత్నంలో దారుణ పరాజయం పాలైంది. అమెరికా వైట్‌హౌస్ నిర్వహించిన సైనిక పరేడ్‌కు తమ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు ఆహ్వానం అందిందని పాకిస్థాన్ వర్గాలు ప్రచారం చేయగా, ఈ వార్తలను అమెరికా ఖండించింది. ఈ సమాచారం అసత్యమని, పరేడ్‌కు ఎలాంటి విదేశీ సైనికాధికారిని ఆహ్వానించలేదని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం నిర్వహించిన ఈ భారీ సైనిక పరేడ్ 1775 జూన్ 14న ఏర్పడిన అమెరికా సైన్యాన్ని స్మరించుకుంటూ జరిగింది. ఇది ట్రంప్ 79వ పుట్టినరోజు సందర్భంగా కూడా నిర్వహించబడింది. ఆయన పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఇది అమెరికా సైనిక శక్తిని ప్రదర్శించే విశేషమైన కార్యక్రమంగా నిలిచింది.

అయితే, అసత్య ప్రచారాలతో చర్చకు దారితీసిన ఈ ఘటన పాకిస్థాన్‌కు పరువు నష్టం తీసుకువచ్చింది. గతంలో కూడా అమెరికా పర్యటనకు వెళ్లిన బిలావల్ భుట్టో బృందం ఉన్నతస్థాయి అధికారులను కలవడంలో విఫలమైందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

శనివారం నిర్వహించిన పరేడ్‌లో వేలాది మంది సైనికులు, ట్యాంకులు, హెలికాప్టర్లు, పారాట్రూపర్లు పాల్గొన్నారు. ఇది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు లేదా ఫ్రాన్స్ బాస్టిల్ డే పరేడ్‌ల మాదిరిగా కాకుండా, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే నిర్వహించే ప్రదర్శన. చివరిసారిగా ఇంత స్థాయిలో 1991లో “నేషనల్ విక్టరీ సెలబ్రేషన్” పేరుతో ఇరాక్‌పై విజయాన్ని గుర్తుగా నిర్వహించారు. ఇప్పుడు జరిగిన పరేడ్, పాకిస్థాన్‌కు తప్పుడు ప్రచారాలు ఎంత దారుణంగా విఫలమవుతాయో మరోసారి రుజువు చేసింది.

ICC Rules : వన్డేలలో రెండు కొత్త రూల్స్‌. ఐసీసీ గ్రీన్ సిగ్నల్

  Last Updated: 15 Jun 2025, 02:10 PM IST