Site icon HashtagU Telugu

Terror Attack : కశ్మీర్ ఉగ్రదాడి మా పనే : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్

Terror Attack

Terror Attack

Terror Attack :ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆదివారం రోజు జమ్మూ కశ్మీర్‌‌లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపింది. వైష్ణోదేవీ ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై జరిగిన ఈ దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడ్డారు.  చనిపోయిన వాళ్లంతా  ఉత్తరప్రదేశ్‌ వాస్తవ్యులని.. వీరంతా  కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తుండగా ఈ ఉగ్రదాడి(Terror Attack) జరిగిందని గుర్తించారు. అయితే ఈ దాడి తమ పనేనని తాజాగా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (PAFF) ప్రకటించింది. PAFF ఉగ్ర సంస్థ.. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మద్దతుతో కశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వైష్ణోదేవీ ఆలయ యాత్రికుల బస్సుపై దాడి ఘటనలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు భారత భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.  ఉగ్రమూకల కోసం రియాసీలో భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అటవీ ప్రాంతంలో సోదాలకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

వచ్చే సంవత్సరం మే 5న గోవా వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు తమ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరవుతారని పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం రోజు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కశ్మీర్‌లో ఉగ్రదాడి జరగడం గమనార్హం. దీంతో బిలావల్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయన పర్యటన షెడ్యూలు ప్రశ్నార్ధకంగా మిగిలింది. చివరిసారిగా భారత్‌లో పర్యటించిన  పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్. ఆమె  2011లో భారత్‌కు వచ్చి వెళ్లారు.

Also Read :Modis First Signature : ప్రధానిగా తొలి సంతకం చేసిన మోడీ.. ఆ ఫైలుపై సిగ్నేచర్ !

తాజాగా కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి భారత్ – పాక్ సంబంధాలను ప్రతికూలంగా  ప్రభావితం చేసే అవకాశం ఉంది.  26/11 ముంబై ఉగ్రదాడిలో దాదాపు 179 మంది ప్రాణాలను కోల్పోయారు. అప్పట్లో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా ఆ దాడికి పాల్పడింది.  నాటి నుంచి పాకిస్తాన్, భారత్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజీపడబోమని భారత్ పదే పదే పాకిస్తాన్‌కు, చైనాకు స్పష్టం చేస్తూ వస్తోంది. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రతను అణగదొక్కే అన్ని ప్రయత్నాలను ఎదుర్కోవడానికి గట్టి నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని భారత్ హెచ్చరిస్తోంది.

Also Read : Chandrababu New Convoy : చంద్రబాబు కోసం సిద్ధమైన కొత్త కాన్వాయ్‌