ISRO Vs Pakistan : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ ఫోకస్ పాకిస్తాన్‌పై పడింది. భారత్-పాకిస్తాన్, భారత్ – చైనా బార్డర్‌తో పాటు మన దేశంలోని తీర ప్రాంతాలపై నిఘా పెట్టేందుకు ఒక ప్రత్యేక శాటిలైట్‌ను ఇస్రో రెడీ చేసింది. దాని పేరు.. ఈవోఎస్-09. ఇందులో సీ-బ్యాండ్ సింథటిక్స్ ఎవర్చర్ రాడార్ ఉంది. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా హై రిజల్యూషన్‌తో కూడిన భూ ఉపరితల ఫొటోలను(ISRO Vs Pakistan) తీసి పంపగలదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఈ పనిని చేయడం ఈవోఎస్-09 శాటిలైట్ ప్రత్యేకత.
Also Read :Padma Awards: పద్మ అవార్డులను అందుకున్న ఆటగాళ్లు వీరే.. జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్!
భారత్‌కు ఇప్పటికే అధునాతన కార్టోశాట్-3 ఉపగ్రహం ఉంది. ఇది లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో తిరుగుతూ సరిహద్దు ప్రాంతాల ఫొటోలు తీసి పంపుతోంది. అయితే ఇది రాత్రి టైంలో పనిచేయదు. దీనివల్ల సరిహద్దుల్లో శత్రు దేశాలు, ఉగ్రవాదులు రాత్రి టైంలో రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇకపై ఈ ఆటలు సాగవు. ఎందుకంటే ఈవోఎస్-09 శాటిలైట్‌ను ప్రయోగించేందుకు భారత్ రెడీ అవుతోంది. జూన్ నెల మొదటివారంలో ఈ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. భారత్‌కు ఇప్పటికే అంతరిక్షంలో 50కిపైగా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ వాటికి జతకలవనుంది.
Also Read :Pak Violates Ceasefire: బోర్డర్‌లో మరోసారి టెన్షన్.. పాక్- భారత్ మధ్య కాల్పులు!
150 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు రెడీ
దేశ భద్రతా అవసరాల కోసం రాబోయే మూడేళ్లలో 150 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో రెడీ అవుతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఒకేసారి నాలుగు రాకెట్ల అనుసంధానానికి వీలుంది. తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రయోగ కేంద్రాన్ని కూడా ఈ ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి ద్వారా త్వరతిగతిన ఉపగ్రహ ప్రయోగాలకు ఛాన్స్ ఉంటుంది. మన దేశానికి దాదాపు 7,500 కిలోమీటర్ల మేర తీరరేఖ ఉంది. దీంతో తీరప్రాంతాల్లో నిఘా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలపై ఇస్రో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న 55 ఉపగ్రహాలు అవసరాలను తీర్చలేకపోవడంతో, కొత్త ఉపగ్రహాల కోసం ఇస్రో భారీ ప్రణాళికను తయారు చేసింది.