LK Advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఓవైసీ ఎటాక్

ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయడంపై అసదుద్దీన్ ఒవైసీ విచారం వ్యక్తం చేశారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేమీ కాదని మండిపడ్డారు

LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. అద్వానీకి భారతరత్న ప్రదానం చేయడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అని ప్రధాని అన్నారు. అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారని కొనియాడారు. ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్‌ చేసి, కంగ్రాట్స్‌ చెప్పినట్లు మోదీ తెలిపారు.

ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయడంపై అసదుద్దీన్ ఒవైసీ విచారం వ్యక్తం చేశారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేమీ కాదని మండిపడ్డారు ఒవైసి. 1990 సెప్టెంబర్ 23 నుండి నవంబర్ 5 వరకు అద్వానీ ‘రథయాత్ర’లో హింసకు గురైన భారతదేశంలోని ప్రదేశాల మ్యాప్‌తో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు. అయితే హింసతో చేశారని ఒవైసి చెప్పారు. అయోధ్యలోని రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణం కోసం జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా అద్వానీ రథయాత్ర దేశవ్యాప్తంగా సాగింది. ఈ ఉద్యమం డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతతో పరాకాష్టకు చేరుకుందన్నారు.

ఎల్‌కే అద్వానీ 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎక్కువకాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సారధ్యంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన 90వ దశకంలో బీజేపీ ఎదుగుదల కోసం ఎల్‌కే అద్వానీ విశేష కృషి చేశారు. 2002-04 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారు.

Also Read: Rajasthan: దళిత బాలుడి చేత మూత్రం తాగించిన పోకిరీలు